Ind vs NZ : వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇండియా న్యూజిలాండ్ టీమ్ లా మధ్య ఒక భారీ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే రెండు టీములు కూడా నాలుగు విజయాలు నమోదు చేసుకొని పాయింట్లు పట్టికలో నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్ లో కొనసాగుతున్న టీములు కావడం వల్ల ఈ రెండు టీముల్లో ఏ టీమ్ విజయం సాధిస్తుంది అనే ఆసక్తి అందరి లో నెలకొంది.ప్రపంచంలోని వాళ్ళందరూ ఈ మ్యాచ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలో ఇండియన్ టీం నెంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతుంది.అలాగే ఇండియన్ టీం ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి టీమ్ లను మట్టి కరిపించి ప్రస్తుతం న్యూజిలాండ్ తో పోరు కు సిద్ధమైంది. ఇక న్యూజిలాండ్ టీం కూడా ఇంగ్లాండ్, నెదర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి టీం లని ఓడించి కూడా అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతుంది. ఇక ఈ క్రమంలో ఏ జట్టు బలంగా ఉందో తెలియాలంటే ఈ మ్యాచ్ జరిగేంతవరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఇవాళ్ల 2 గంటలకి ధర్మశాల స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది… ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం తరపున గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ లు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.ఇక ఈ క్రమంలో న్యూజిలాండ్ టీమ్ ప్లేయర్లు అయిన డేవిన్ కాన్వే, రచిన్ రవీంద్ర , లాతం లాంటి ప్లేయర్లు న్యూజిలాండ్ టీమ్ లో కీలకం కానున్నారు.ఇక ఇరు జట్లు కూడా భారీ పరుగులు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇక ఇలాంటి సమయం లో ఇరు జట్ల నుంచి ఒక ఉత్కంఠ పోరుకు సర్వం సిద్ధమైందనే చెప్పాలి. ఇంకా కొన్ని గంటలు గడిస్తే తప్ప ఈ మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుందనేది చెప్పడం కష్టమవుతుంది…
ఇప్పటి వరకు ఈ రెండు టీములు హెడ్ టు హెడ్ మ్యాచ్ 116 మ్యాచ్ ల్లో తలపడగా అందులో 58 సార్లు న్యూజిలాండ్ టీమ్ గెలిస్తే, ఇండియా 50 సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక దానికి తగ్గట్టుగా ఇంకో ఎనిమిది మ్యాచ్ ల్లో ఫలితం తేలలేదు. ఇక వరల్డ్ కప్ విషయానికి వస్తే వరల్డ్ కప్ లో కూడా న్యూజిలాండ్ ఇండియా మీద పై చేయి సాధిస్తూ వస్తుంది.ఈ రెండు టీములు ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో తొమ్మిది సార్లు తలపడితే అందులో న్యూజిలాండ్ 5 సార్లు విజయం సాధించగా, ఇండియా 3 సార్లు మాత్రమే విజయం సాధించింది.ఇక ఒక మ్యాచ్ టై అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ టీం న్యూజిలాండ్ టీం మీద ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తుంది అనే సందేహం క్రికెట్ అభిమానుల్లో ఉంది.ఇక ఈ మ్యాచ్ లో కనుక ఇండియా విజయం సాధిస్తే ఈసారి వరల్డ్ కప్ పక్కగా ఇండియా టీమ్ గెలుచుకుంటుంది అని క్రికెట్ అభిమానులతో పాటుగా, క్రికెట్ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు…