India vs England 1st Test : మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్ మీద ఇండియా ఓటమికి కారణం ఏంటంటే..?

ఎందుకంటే మనవాళ్ళు చేరుకోవాల్సిన టార్గెట్ పెద్ద కష్టమైతే కాదు. కానీ ఇండియన్ టీం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈ మ్యాచ్ ని ఆడిందనే చెప్పాలి...

Written By: NARESH, Updated On : January 28, 2024 8:42 pm

India vs England - 1st Test

Follow us on

India vs England – 1st Test : ఇండియా – ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఘన విజయాన్ని సాధించింది.ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో 231 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఇండియన్ టీమ్ ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కోలేక చతకలబడిపోయింది. ఇక ఇంగ్లాండ్ టీమ్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న స్పిన్నర్ ‘టామ్ హర్ట్ లే’ తన దైన రీతిలో బౌలింగ్ చేసి 62 పరుగులు ఇచ్చి 7 వికెట్లను తీశాడు. ఇక ఈ దెబ్బతో ఇండియన్ టీం బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు.

ప్రస్తుతం ఇండియన్ టీమ్ ఉన్న ఫామ్ కి 231 పరుగులు పెద్ద కష్టం అయితే కాదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ టీం అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి ఇండియాను బోల్తా కొట్టించింది అనే చెప్పాలి. మన దేశంలో మనకు బాగా కలిసి వచ్చిన పిచ్ లో కూడా ఇంగ్లాండ్ ప్లేయర్లని ఎదుర్కోవడం లో మన టీమ్ తడబడింది అంటే, మన ప్లేయర్ల లో చాలా వరకు ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైందనే చెప్పాలి. ఇప్పుడే కాదు ఇండియన్ టీం ఎప్పుడైనా కూడా ఎవరైనా కొత్త బౌలర్లు టీం లోకి వచ్చారంటే వాళ్ళ చేతికి ఈజీగా దొరికిపోతారు. ఇంతకుముందు చాలా మ్యాచ్ ల్లో కూడా ఇలానే జరిగింది.

ఇక ఇలాంటి ఆనవాయితీని ఇండియన్ టీమ్ ఎందుకు పాటిస్తూ వస్తుందో ఇప్పటికి అర్థం కావడం లేదు…ఇక ఇండియన్ బ్యాట్స్ మెన్ లలో రోహిత్ శర్మ 39 పరుగులు చేయగా, శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విని ఇద్దరు తలా 28 పరుగులు చేశారు. ఇక వీళ్ళని మినహాయిస్తే ఎవ్వరు కూడా 20 పరుగులు దాటలేదు అంటే మన వాళ్ళ స్టాండర్డ్ ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.ఇండియన్ ప్లేయర్లు కేవలం సెకండ్ ఇన్నింగ్స్ లో 202 పరుగులు మాత్రమే చేశారు. ఇంకా విజయానికి 28 పరుగులు అవసరం ఉండగా ఇండియన్ టీం చేతులెత్తేసింది. ఈ అపజయానికి కారణం ఇంగ్లాండ్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చింది అనేదానికంటే ఇండియన్ టీం ఫేలవమైన పర్ఫామెన్స్ ఇచ్చిందనే చెప్పాలి.

ఎందుకంటే మనవాళ్ళు చేరుకోవాల్సిన టార్గెట్ పెద్ద కష్టమైతే కాదు. కానీ ఇండియన్ టీం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈ మ్యాచ్ ని ఆడిందనే చెప్పాలి… ఇక ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 246 పరుగులు చేయగా, ఇండియన్ టీం 436 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ టీం 420 పరుగులు చేయగా, ఇండియన్ టీమ్ 202 పరుగులు మాత్రమే చేసింది…