India Vs England 1st Test: అశ్విన్, జడ్డూ దెబ్బకు ఇంగ్లండ్ మూడు వికెట్లు డౌన్..

సీమర్లను ఇంగ్లడ్‌ బ్యాట్స్‌మెన్‌లు సమర్థవంతంగా ఎదుర్కొనడంతో కెప్టెన్‌ రోమిత్‌ స్పిన్నర్లను రంగంలోకి దించాడు. అశ్విన్, జడేజా ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టారు.

Written By: Raj Shekar, Updated On : January 25, 2024 12:23 pm
Follow us on

India Vs England 1st Test: ఇంగండ్‌ – ఇండియా మధ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ గురువారం(జనవరి 25న) ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. ఓపెనర్లు బెన్‌ డకెట్, జాక్‌ క్రాలే ఎప్పటిలాగే దూకుడుగా ఆడి నిష్క్రమించారు. భారత బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అయితే అంతే వేగంగా నిష్క్రమించారు. క్రాలే 40 బంతుల్లో 20 పరుగులు చేశాడు. డకెట్‌ 39 బంతుల్లో 35 పరుగులు చేశాడు.

స్పిన్నర్ల రాకతో..
సీమర్లను ఇంగ్లడ్‌ బ్యాట్స్‌మెన్‌లు సమర్థవంతంగా ఎదుర్కొనడంతో కెప్టెన్‌ రోమిత్‌ స్పిన్నర్లను రంగంలోకి దించాడు. అశ్విన్, జడేజా ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలో అశ్విన్‌ పదునైన బంతులతో ఓపెనర్లిద్దరీని పెవిలియన్‌కు పంపించారు. తర్వాత వచ్చిన పోప్‌ను అశ్విన్‌ తన గుగ్లీతో బురిడీ కొట్టించాడు. దీంతో 99 పరుగులకే ఇంగ్లండ్‌ మూడు వికెట్లు కోల్పోయింది.

బెయిర్‌స్టోను ఇబ్బంది పెట్టిన అక్షర్‌..
తర్వాత వచ్చిన రూట్, బెయిర్‌స్టో నిదానంగా ఆడడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో మరో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ మంచి ఫాంలో ఉన్న బెయిర్‌స్టోను తన బంతులతో ఇబ్బంది పెట్టాడు. దీంతో పరుగు చేయడానికి అతను 25 బందులు ఎదర్కొన్నాడు. అన్ని బందులు బ్యాట్స్‌మెన్‌ అంచులను తాకుతూ లేదా దగ్గరా వెళ్లడంతో బెయిర్‌ స్టో 25 బంతుల తర్వాత రూట్‌ 16 బంతుల తర్వాత తొలి పరుగు తీశారు.

తొలి సెషన్‌లో స్పిన్‌కు అనుకూలం..
ఇక ఈ మ్యాచ్‌లో ఉప్పల్‌ పిచ్‌ తొలి సెషన్‌లో సీమర్లకు పెద్దగా సహకరించలేదు. స్పిన్నర్లకు మాత్రం సహకారం అందించింది. దీంతో దానిని సద్వినియోగం చేసుకున్న అశ్విన్, జడేజా వికెట్లు పడగొట్టారు. లక్షర్‌ కూడా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

నిలకడగా బ్యాటింగ్‌..
పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తుండడంతో బెయిర్‌స్టో, రూట్‌ నిదానంగా ఆడుతున్నారు. లంచ్‌ విరామ సమయానికి రూట్‌ 35 బంతుల్లో 18 పరుగులు చేయగా, బెయిర్‌స్టో 44 బంతుల్లో 35 పరుగులు చేశారు. కుదురుకున్నాక ఇద్దరూ లూస్‌ బంతులను బౌండరీలకు తరలిస్తున్నారు.

డ్రై పిచ్‌..
ఇదిలా ఉండగా టాస్‌ తర్వాత మీడియాతో మాట్లాడిన రోహిత్‌ పిచ్‌ పొడిగా ఉందని తెలిపాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని అభిప్రాయపడ్డాడు. తమ టీం పూర్తి సన్నద్ధంగా ఉందని తెలిపారు. ఈ పిచ్‌పై ఎలా ఆడాలో ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని వెల్లడించారు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లతో బరిలో దిగుతున్నట్లు తెలిపారు.

కుల్దీప్‌ స్థానంలో అక్షర్‌..
ఇదిలా ఉండగా నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయగా ఇందులో ముగ్గురు ఫైనల్‌ టీంలో తీసుకున్నారు జడేజా, అశ్విన్‌తోపాటు అక్షన్, కుల్దీప్‌ మూడో స్పిన్నర్‌ స్థానానికి పోటీ పడ్డాడు. అయితే ఆస్ట్రేలియాతో టెస్టులో అక్షర్‌ ప్రతిభ కనబర్చడంతో కెప్టెన్‌ తుది జట్టులోకి తీసుకున్నాడు.

లంచ్‌..
ఇదిలా ఉండగా ఇంగ్లండ్‌ లంచ్‌ సమయానికి 28 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. లంచ్‌ తర్వాత మ్యాచ్‌ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం రూట్, బెయిర్‌స్టో బ్యాటింగ్‌ చేస్తున్నారు.