India vs Bangladesh – Virat Kohli : సిక్స్ కొట్టి సెంచరీ చేసిన విరాట్.. బంగ్లాను ఓ ఆట ఆడేసుకున్నాడు

విరాట్ సెంచరీ కాదని కంగారు పడ్డ ప్రేక్షకులు, టీమిండియా క్రికెటర్లకు విరాట్ లాస్ట్ కు సిక్స్ కొట్టి సెంచరీ చేయడంతో అంతా సంబరాలు చేసుకున్నారు.

Written By: NARESH, Updated On : October 19, 2023 9:45 pm
Follow us on

India vs Bangladesh : విరాట్ కోహ్లీ చెడుగుడు ఆడేశాడు.. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఈరోజు ఫూణేలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓ ఆట ఆడుకున్నాడు. ఇండియాతో మ్యాచ్ కు ముందు విర్రవీగిన బంగ్లాను చిత్తుగా ఓడించాడు. గెలిస్తే నాగిని డ్యాన్స్ చేస్తాం అని విర్రవీగిన బంగ్లాదేశ్ కు గట్టి షాక్ తగిలింది. ఇక ఇండియాను ఓడిస్తే బంగ్లాదేశీ క్రికెటర్లతో డేటింగ్ కు వస్తానన్న పాకిస్తానీ నటి ఆశలు నెరవేరలేదు. అన్నట్టుగానే ఈరోజు బంగ్లాపై విరాట్ విరగకొట్టేశాడు.

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ 8 వికెట్లకు 256 పరుగుల స్కోరు చేసింది. ఓపెనర్లు టాంజిడ్ 51, లిటన్ దాస్ 66 పరుగులు చేసి మంచి ఓపెనింగ్ ఆరంభాన్ని ఇచ్చారు. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడంతో బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధించలేకపోయింది.

ఇక 257 పరుగుల లక్ష్య ఛేధనతో రంగంలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు దుమ్ముదులిపారు. శుభ్ మన్ గిల్ 53 పరుగులు, రోహిత్ శర్మ 48 పరుగులతో దంచి కొట్టడంతో మంచి ఆరంభం వచ్చింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చి 97 బంతుల్లో 103 పరుగులతో సెంచరీ సాధించాడు.

నిజానికి ఈ మ్యాచ్ లో 85 పరుగుల వద్ద ఉన్న విరాట్ కోహ్లీ సెంచరీ చేయడని అనుకున్నారు. ఎందుకంటే గెలుపునకు 10 పరుగులే కావాలి. కానీ కోహ్లీ 15 పరుగులు సెంచరీ కోసం కావాలి. కానీ పక్కనున్న కేఏల్ రాహుల్ ను పరుగులు చేయకుండా వదిలేయమని.. తను స్ట్రైక్ తీసుకొని సెంచరీ కొట్టాడు. ఇక సెంచరీ 4 పరుగులు కావాల్సిన దశలో గెలుపునకు కేవలం 2 పరుగులు కావాలి. కానీ బంగ్లా బౌలర్ వైడ్ వేసి 1 పరుగు ఇచ్చాడు. దీంతో ఆ బాల్ కు సిక్స్ కొట్టి విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. అటు తన సెంచరీని.. ఇటు టీంను గెలిపించాడు. నాటకీయ పరిణామాల మధ్య ఈ సెంచరీ వచ్చింది. విరాట్ సెంచరీ కాదని కంగారు పడ్డ ప్రేక్షకులు, టీమిండియా క్రికెటర్లకు విరాట్ లాస్ట్ కు సిక్స్ కొట్టి సెంచరీ చేయడంతో అంతా సంబరాలు చేసుకున్నారు.