India 5th Largest Economy In The World: కాలం ఎల్లప్పుడూ ఒక్కరి పక్షానే ఉండదు. ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి. ఈ విషయం మరోసారి రుజువైంది. తన సామ్రాజ్యవాదంలో భారత వనరులను ఏకంగా 200 ఏళ్లు కొల్లగొట్టిన బ్రిటన్ ఆర్థికంగా నేడు వెనకబడింది. ప్రపంచంలో బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ యూకేను వెనక్కు నెట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది. రెండే శతాబ్దాలు సంపదను దోచుకుపోయినా ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానాలతో కేవలం 76 ఏళ్లలో భారత్ మన సంపదను దోచుకున్న దేశాన్ని మించిన ఆర్థిక శక్తిగా ఎదిగింది. దీనిపై యావత్ భారత్‌తోపాటు వ్యాపారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థిక మాంద్యం.. కరోనా..
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం అనేక దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా కారణంగా ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మళ్లీ మందగించాయి. వీటికితోడు కోలుకుంటున్న సమయంలోనే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం పెరిగింది. సరఫరా వ్యవస్థలు స్తంభించటం, ఇబ్బందులకుగురికావటం వల్ల ఉత్పాదకత మళ్లీ దెబ్బతింది.
ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పు..
కరోనా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా అగ్రరాజ్యాలుగా పరిగణించబడే టాప్–10 దేశాల్లో భారీ మార్పు వచ్చింది. అయితే.. రష్యాకు మిత్రదేశంగా ఉన్న భారత్‌సహా పలు దేశాలు మాత్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నాయి. దీంతో ప్రపంచంలోని టాప్– 10 ఆర్థిక దేశాల జాబితాలో 5వ స్థానంలో ఉన్న బ్రిటన్ ఇప్పుడు 6వ స్థానానికి పడిపోయింది. యూకేను వెనక్కునెట్టి భారత్ ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది.
అస్తవ్యస్తంగా బ్రిటన్ ఆర్థిక పరిస్థితి..
బ్రిటీష్ ఆర్థిక వ్యవస్థ, వ్యాపారం ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారింది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కారణంగా 5వ స్థానంలో ఉన్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 6వ స్థానానికి దిగజారింది. మరోవైపు అక్కడి ప్రభుత్వం నుంచి చాలా మంది మంత్రులు రాజీనామా చేశారు. కొత్త ప్రధాన మంత్రి ఎవరు అనే రేసులో లిజ్ ట్రస్ ముందంజలో ఉండగా.. బ్రిటీష్ భారతీయుడైన రిషి సునక్ వెనుకబడ్డారు. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థ సుస్థిర వృద్ధి సాధిస్తోంది.

పటిష్టంగా భారత్ పరిస్థితి..
ఐఎంఎఫ్ విడుదల చేసిన డేటా ఆధారంగా.. రష్యా నుంచి∙ముడి చమురు తగ్గింపు ధర కారణంగా మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. ఫలితంగా భారత్ 5వ స్థానానికి ఎగబాకింది. అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. చైనా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో జపాన్, జర్మనీ, భారత్, బ్రిటన్ ఉన్నాయి. త్వరలోనే జర్మనీని భారత్ అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రతీ భారతీయుడు గర్వించే విషయం..
200 ఏళ్లు బ్రిటీల్ పాలనలో ఎదుర్కొన్న అణచివేత, సంపద తరలిపోయినా.. వాటిని అధిగమించి భారత్ బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. ‘ప్రస్తుతం మనల్ని పాలించిన బ్రిటిష్ దేశాన్నే సెప్టెంబర్ 3న భారత్ అధిగమించింది. ఇది నిజంగా శుభ పరిణామం. దేశ స్వాతంత్య్రం కోసం అహర్నిశలు పోరాడిన, త్యాగం చేసిన ప్రతీ భారతీయుడి గుండెల్లో ఈవార్త నిండి ఉంటుంది. భారతీయుడిగా మనం గర్వించే క్షణాలు ఇవి’ అని మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. లా ఆఫ్ కర్మ అంటే ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. అనేక మంది నెటిజన్లు మహీంద్రా అభిప్రాయంతో ఏకీభవిస్తూ ప్రశంశిస్తున్నారు.
Also Read:Asia Cup Super 4 schedule: ఆసియాకప్: ఈ సండే మళ్లీ ఇండియా-పాక్ బిగ్ ఫైట్.. సూపర్ 4 షెడ్యూల్ ఇదే


[…] […]