Homeజాతీయ వార్తలుIndia Port : అంతర్జాతీయ సరుకు రవాణా బదిలీ నౌకాశ్రయాలు భారత్ కు లేవు

India Port : అంతర్జాతీయ సరుకు రవాణా బదిలీ నౌకాశ్రయాలు భారత్ కు లేవు

India Port :  రవాణా విషయంలో ఈ రోజుకు అధిక వ్యాపారం జరిగేది సముద్ర మార్గంలో, ఆ తర్వాత భూమార్గంలో. కాకపోతే భూమార్గంలో కొన్ని ఇబ్బందులున్నాయి. ఉదాహరణకు మనకు పాకిస్తాన్ తో సత్సంబంధాలు లేవు. అందువలన పాకిస్తాన్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, మధ్య ఆసియా లాంటి దేశాలకు మనం భూ భాగం ద్వారా రవాణా చేయలేము. అలాగే తూర్పున ఆగ్నేయాసియా కూడా భూ భాగం ద్వారా వ్యాపారం చేయలేకపోతున్నాం. దానికి ముఖ్యంగా అదునాతన రవాణా వ్యవస్థ లేకపోవడం. మరి ప్రత్యామ్నాయం ఏమిటి?

అంతర్జాతీయ సరుకు రవాణా బదిలీ నౌకాశ్రయాలు భారత్ కు లేవు | India Port | Analysis By Ram Talk

ఇప్పటివరకు మనకు ప్రధానంగా రెండే దారులున్నాయి. ఒకటి పశ్చిమ తీరం నుంచి హిందూమహాసముద్రం మీదుగా ఎర్రసముద్రం ద్వారా సూయెజ్ కాల్వ ద్వారా మధ్యధరా సముద్రం మీదుగా ; రెండోది, తూర్పు తీరంనుంచి మలక్కా జలసంధి ద్వారా. ఇవి రెండూ అతి రద్దీ మార్గాలు. ముఖ్యంగా సూయెజ్ కాల్వ మార్గం. ఉదాహరణకు యూరప్, రష్యాకి ఈ మార్గం నుంచే వెళ్ళాలి. చివరకు మనకు దగ్గరగా వున్న మధ్య ఆసియా కు కూడా. దీనివలన భారత్ వ్యాపారంలో వెనకబడుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుతం భారత్ రష్యా నుంచి క్రూడాయిల్ కొంటుంది. ఇది సెయింట్ పీటర్స్ బర్గ్ రేవు నుంచి భారత్ కు రావాలంటే దాదాపు 40 రోజులు పడుతుంది. బాల్టిక్ సముద్రం నుంచి ఇంగ్లీష్ ఛానల్ ద్వారా జిబ్రాల్టర్ జలసంధి దాటి మధ్యదరా సముద్రం, సూయెజ్ కాల్వ మీదుగా ఎర్ర సముద్రం దాటి హిందూమహాసముద్రం ద్వారా మన పశ్చిమ తీరం రావాలి.

మరి ఈ భారీ ఓడలు మనదేశంలో ఆగడానికి సరైన పోర్టులు లేవు. అందుకే అంతర్జాతీయ సరుకు రవాణా బదిలీ నౌకాశ్రయాలు భారత్ కు లేవన్నది వాస్తవం. మరి భారత్ లో అలాంటి పోర్టులు మోడీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. దీనివెనుక కారణాలు.. లాభాలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version