https://oktelugu.com/

India Alliance : బెంగాల్, కేరళ, పంజాబ్ ల్లో ఇండీ కూటమి కొట్లాట

బెంగాల్, కేరళ, పంజాబ్ ల్లో ఇండీ కూటమి కొట్లాటలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : February 24, 2024 / 06:48 PM IST
    Follow us on

    ఇండీ కూటమిలో పొత్తులు కుదురుతున్నాయట.. టీవీల్లో ఊదరగొడుతున్నారు. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు.. ఆమ్ ఆద్మీతో పొత్తు ఫైనలైజ్ అయ్యిందని..టీఎంసీతోనూ పొత్తు కుదిరిందని ప్రచారం చేస్తున్నారు.

    కానీ జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతున్నట్టు ఈ పొత్తుల వ్యవహారం సాగుతోంది. ఎక్కడ పొత్తులు జరుగుతున్నాయో చూస్తే.. ఉత్తరప్రదేశ్ లో పొత్తులు పొడిచాయి. బీజేపీకి అక్కడ 50 శాతానికి పైగా ఓటు బ్యాంకు ఉంది. ఎస్పీ, బీఎస్పీ కలిసినా గత సారి బీజేపీ చేతిలో చిత్తుగా ఓడిపోయాయాయి.. ఇక ఈసారి అయోధ్యలో రామమందిరం నిర్మించాక బీజేపీని ఓడించే సామర్థ్యం యూపీలో ఎవరికీ లేదు.

    పోయిన సారి 67 ఎంపీ సీట్లలో పోటీచేస్తే.. 63 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్.. అలాంటి కాంగ్రెస్, సమాజ్ వాదీతో కలిసి పొత్తు పెట్టుకుంటే టీవీల్లో ఒకటే ప్రచారం.. రాజ్ దీప్ సర్దేశాయ్ లాంటి జర్నలిస్టులు నెత్తిన పెట్టుకుంటున్నారు.

    గుజరాత్ లో ఆప్ గొడవ నడుస్తోంది. అది సెటిల్ అవుతోంది. కాంగ్రెస్, ఆప్ కలుస్తున్నాయట.. గుజరాత్ లో బీజేపీ ఓటు శాతం 60కిపైగా ఉంది.

    బెంగాల్, కేరళ, పంజాబ్ ల్లో ఇండీ కూటమి కొట్లాటలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.