IND vs NZ : సెంచరీతో విరుచుకు పడిన మిచెల్… చివర్లో షాకిచ్చిన టీమిండియా.. షమీ మాయ

రచన్ రవీంద్ర, మిచెల్ ఇద్దరు కలిసి నిదానంగా ఆడుతూ స్కోర్ ను చక్కదిద్దే పనిలో బిజీ అయి చాలా అద్భుతంగా ఆడుతూ టీమ్ కి భారీ స్కోరు అందించే ప్రయత్నం చేశారు.

Written By: Gopi, Updated On : October 22, 2023 6:25 pm
Follow us on

ODI World Cup 2023, IND vs NZ : వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇండియా న్యూజిలాండ్ టీమ్ ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది.ఇక ఈ క్రమం లోనే ఆ రెండు టీమ్ లు కూడా ఇప్పటి వరకు వరుస విజయాలను అందుకోవడం తో ఈ మ్యాచ్ మీద రెండు దేశాల అభిమానులు తీవ్రమైన ఆశలను పెట్టుకున్నారు .ఇక ఈ క్రమం లోనే ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి ఇండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఇక అందులో భాగంగానే మొదట బ్యాటింగ్ కి వచ్చిన న్యూజిలాండ్ టీమ్ కి మొదట్లోనే భారీ దెబ్బ తగిలింది.

డేవిన్ కాన్వే సిరాజ్ బౌలింగ్ లో శ్రేయాస్ అయ్యర్ కి క్యాచ్ ఇచ్చి డక్ ఔట్ అయ్యాడు.ఇక మరో ఓపెనర్ అయిన విల్ యంగ్ కూడా చాలా తక్కువ స్కోరుకే ఔట్ అయిపోయాడు. ఇక న్యూజిలాండ్ టీమ్ 19 పరుగులకు రెండు వికెట్లను కోల్పోయి తీవ్రమైన ఇబ్బందుల్లో పడింది. ఇక ఇలాంటి పరిస్థితిలో క్రీజ్ లోకి వచ్చిన రచన్ రవీంద్ర , డారియల్ మిచెల్ అందరూ కూడా టీమ్ ని చక్కదిద్దే పనిలో పడి ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇక ఇలాంటి క్రమంలో రచన్ రవీంద్ర, మిచెల్ ఇద్దరు కలిసి నిదానంగా ఆడుతూ స్కోర్ ను చక్కదిద్దే పనిలో బిజీ అయి చాలా అద్భుతంగా ఆడుతూ టీమ్ కి భారీ స్కోరు అందించే ప్రయత్నం చేశారు.

ఇక ఈ క్రమంలోనే న్యూజిలాండ్ టీం చాలా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తూ వచ్చింది.ఇక ఆ క్రమం లోనే రచిన్ రవీంద్ర 87 బంతుల్లో 75 పరుగులు చేసిన రచన్ రవీంద్ర అవుట్ అయిపోయాడు.డారియల్ మిచెల్ మాత్రం అతను అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే న్యూజిలాండ్ టీం కి భారీ స్కోర్ అందించడంలో వీళ్ల శక్తి మేరకు పోరాడుతూ వచ్చారు ఇక ఆ క్రమం లోనే మిచెల్ సెంచరీని చేసి ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ ఇండియన్ బౌలర్లని ఎదుర్కోవడంలో చాలావరకు సక్సెస్ అయ్యాడు. ఇక ఇలాంటి క్రమంలోనే న్యూజిలాండ్ టీమ్ బలం ఏంటి అనేది మరోసారి ఆ ప్లేయర్లు చాలా చక్కగా ఆడి చూపించారు. రచన్ రవీంద్ర ,డానియల్ మిచెల్ ని మినహా ఇస్తే మిగిలిన వారు ఎవరు కూడా అంత పెద్దగా పెర్ఫార్మన్స్ అయితే ఇవ్వలేదు. ఇక ఒక మ్యాచ్ లో భారీ స్కోరు రావడానికి ఒక ఇద్దరు ప్లేయర్లు కరెక్ట్ గా స్టాండ్ అయితే సరిపోతుంది అని చెప్పడానికి వీళ్లిద్దరిని ఉదాహరణకు తీసుకోవచ్చు…

ఇక నిర్ణీత 50 ఓవర్లకి న్యూజిలాండ్ టీమ్ 273 పరుగులు చేసి ఆలౌట్ అయిపోయారు…ఇక ఇలాంటి క్రమం లోనే మిచెల్ 130 రన్స్ చేసి ఔట్ అయిపోయాడు…ఇక ఇండియన్ బౌలర్లలో మహమ్మద్ షమీ 5 వికెట్లు తీశాడు…ఇక కుల్దిప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు అలాగే బుమ్రా సిరజ్ ఇద్దరు కూడా చేరో వికెట్ తీశారు…