IND vs NZ : టీమిండియా బ్యాట్స్ మెన్ కు పూనకలు వచ్చాయి. 2019లో మనల్ని ఓడించిన న్యూజిలాండ్ పై ప్రతీకారంతో టీమిండియా బ్యాట్స్ మెన్ రగిలిపోయారని అర్థమైపోయింది. అందుకే వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్టుగా న్యూజిలాండ్ బౌలింగ్ ను చీల్చిచెండాడారు. కెప్టెన్ రోహిత్ శర్మ మొదలుపెట్టిన విధ్వాంసకాండను ఆ తర్వాత గిల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కొనసాగించారు.
రోహిత్ ఔట్ తర్వాత 80 పరుగులు చేసిన గిల్ కు తిమ్మిర్లు రావడంతో పరిగెత్తలేక రిటైర్డ్ హర్ట్ గా వైదొలిగాడు. ఆ తర్వాత కోహ్లీ 117 సెంచరీ కొట్టి భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ న్యూజిలాండ్ బ్యాటర్లపై విరుచుకుపడి 70 బంతుల్లోనే 105 మరో సెంచరీతో కదం తొక్కడంతో ఇండియన్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 397 పరుగుల భారీ స్కోరు చేసింది…ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ ప్లేయర్లు దూకుడుకి కళ్లెం వేయడమే కాదు కదా ఆ బీభత్సాన్ని చూడటానికి కూడా న్యూజిలాండ్ ప్లేయర్లు భయపడి పోయారు. ఒక తుఫాన్ గాలి వీస్తే ఎలా ఉంటుందో, ఒక ఉప్పెన వచ్చి మీద పడి పోతే ఎలా ఉంటుందో అంతటి ఘోరాన్ని మన బ్యాట్ మెన్స్ చేసి చూపించారు…
ఇక ఇలాంటి క్రమం లో ఈ మ్యాచ్ లో చాలా రికార్డ్ లు కూడా బ్రేక్ అయ్యాయి. ఇక ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో 49 సిక్స్ లు కొట్టిన ప్లేయర్ గా క్రిస్ గేల్ పేరు మీద ఉన్న రికార్డ్ రోహిత్ శర్మ పేరు మీదకి మారిపోయింది. రోహిత్ శర్మ కేవలం 27 ఇన్నింగ్స్ ల్లోనే 50 సిక్స్ లు కొట్టి ఈ రికార్డ్ నీ బ్రేక్ చేశాడు. అలాగే ఒక వరల్డ్ కప్ టోర్నీ లో సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న హైయెస్ట్ పరుగుల రికార్డ్ ని కోహ్లీ బ్రేక్ చేశాడు. ఇక ఒక వరల్డ్ కప్ టోర్నీ లోనే 700 పరుగులు చేసిన ఏకైక ప్లేయర్ గా కోహ్లీ ఒక రికార్డ్ ని క్రియేట్ చేశాడు…ఇక అన్నిటికీ మించి కోహ్లీ ఎంటైర్ వన్డేల్లో తన 50 వ సెంచరీ ని పూర్తి చేసుకొని సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న రికార్డ్ ని తన పేరు మీదకి మార్చుకున్నాడు…
ఇక ఈ మ్యాచ్ లో బ్యాట్స్ మెన్స్ అద్బుతం చేశారు, బౌలర్లు కూడా అదే తరహాలో బౌలింగ్ చేస్తే ఇండియన్ టీమ్ కి ఒక ఘన విజయం దక్కుతుంది…అలాగే 2019 సెమీ ఫైనల్ లో వీళ్ళ మీద ఓడిపోయిన దానికి భారీ రేంజ్ లో రివెంజ్ తీర్చుకున్నట్టు గా కూడా ఉంటుంది….