Happy Bhogi 2024:: తెలుగు రాష్ట్రాలోని ప్రధాన పండుగల్లో సంక్రాంతి ఒకటి. కొత్త పంటలు, కొత్త అల్లుళ్లు, కోడిపందేలతో ఈ ఫెస్టివెల్ ను ఘనంగా జరుపుకుంటారు. ప్రధానంగా మూడు రోజులు ఉండే పండుగను తెలుగు ప్రజలు 10 రోజుల పాటు ఆనందంగా నిర్వహించుకుంటారు. సంక్రాంతి కంటే ముందు వచ్చేది భోగి పండుగ. మకర సంక్రాంతి నుంచి సూర్యుడు దక్షిణాయానం నుంచి ఉత్తరాయణం వైపు వెళ్తాడు. ఈ క్రమంలో చలి తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సమయంలో నిర్వహించే భోగిపండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పండుగ సందర్భంగా ఇతరులకు విషెష్ చెప్పాలని అనుకుంటున్నారా? అయితే ఇలా చెప్పండి…
భోగి పండుగను ప్రత్యేకంగా నిర్వహించుకుంటారు. సూర్యోదయానికి ముందే లేచి భోగి మంటలు పెడుతారు. గ్రామాలు, పట్టణాల వీధుల్లోని కూడళ్లలో, ప్రత్యేక ప్రదేశాల్లో పాత వస్తువులను తీసుకొచ్చి ఒక్కచోట పేరుస్తారు. ఆ తరువాత వీటిని కాల్చేస్తారు. తమ ఇళ్లల్లోని కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటారు. అనంతరం ప్రజలంతా కొత్త బట్టలు ధరించి భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆటలు ఆడుతారు.. పాటలు పాడుతారు.. అలాగే భోగి పండుగ సందర్భంగా చిన్నారులను ప్రత్యేకంగా అలంకరించి వారి నెత్తిపై రేగుపండ్లను పోసి ఆరోగ్యంగా జీవించాలని దీవిస్తారు.

నేటి కాలంలో కుటుంబ సభ్యులంతా ఎక్కడెడక్కడో జీవిస్తున్నారు. పండుగ సందర్భంగా అందరూ ఒక్కచోటుకు వస్తారు. అయితే కొందరు బంధువులు రాలేని పరిస్థితుల్లో ఉండే వారికి ఆన్ లైన్ ద్వారా ఎలా విషెష్ చెప్పాలి? అని అనుకుంటారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన తెలుగు పదాలతో విషెష్ చెప్పడం ద్వారా ఎదుటి వారిని ఆకర్షించవచ్చు. అంతేకాకుండా పండుగ సందర్భంగా మీరు చెప్పే ఈ పదాలతో ఎదుటివారు ఎంతో ఆనందపడుతారు. మరి భోగి శుభాకాంక్షలు ఎలా చెప్పాలో చూద్దామా..

-మీ జీవితంలో సరికొత్త కాంతులు రావాలి.. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.
-బాధలు, కష్టాలు భోగి మంటల్లో కలిసిపోవాలి.. ఆనందాలు, సంతోషాలు మీ ఇంట వెల్లివిరియాలి.. మీకు భోగి పండుగ శుభాకాంక్షలు.
-మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి, లోహ్రి శుభాకాంక్షలు
-మీ ఇంట భోగభాగ్యాలు, ఆనందాలు ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.
-ఆ పతంగులు ఆకాశానికి కొత్త రంగులు.. ఈ భోగి పండుగ మీ ఇంట్లో సంతోషాలు.. మీకు భోగి పండుగ శుభాకాంక్షలు.
-ఈ భోగి పండుగ నాడు మీరు మొదలు పెట్టే పనులన్నీ విజయవంతం కావాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.

-భోగి భోగభాగ్యాలు కలిగించాలి.. సంక్రాంతి సుఖ సంతోషాలు ఇవ్వాలి.. కనుమ కమనీయ అనుభూతిని మిగల్చాలి.. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.
-భోగి పండుగ మీ ఇంట కొత్త వెలుగులు తేవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.
-ఈ భోగి మంటలు మీ ఇంట్లోని సమస్యలన్నీ మాయం చేయాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.