Amit Shah : అమిత్ షా అపరచాణక్యుడు అని ఇదివరకూ విన్నాం కానీ.. ‘సీఏఏ’ నోటిఫికేషన్ తోటి ఇది ఇంకొక సారి బాగా రుజువైంది. ఆయన ఎంపిక చేసుకున్న టైం అత్యంత వ్యూహాత్మకం. ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు ఈ సీఏఏ అమలు చేసి సంచలనం రేపారు.
ఎంత మంది సీఏఏ పై ఇప్పుడు ఆందోళనలు చేయగలవు. ఎన్నికలు టైం కాబట్టి ప్రతిపక్షాలను దీనిపైన ఆందోళన చేయకుండా అదును చూసి అమలు చేశారు.
సీఏఏ చట్టం చేశాక ప్రతిపక్షాలు, ముస్లిం సంఘాలు, యువత పెద్ద ఎత్తున హింసకు పాల్పడ్డారు. దీనిపై సవివరంగా అందరికీ బీజేపీ పెద్దలు అవగాహన కల్పించారు. దీనివల్ల లాభాలు వివరించారు. ముస్లింలకు ఏం కాదు అన్న భరోసాను కల్పించారు. ముస్లింలను పిలిచి మరీ ఇంటరాక్ట్ అయ్యారు. భారతీయ ముస్లింల గురించి ఇందులో ఎక్కడైనా ఉందా? అని చూపించారు.
పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ తప్పితే వేరే దేశం నుంచి పౌరసత్వం రాదు అన్న విషయాన్ని ముస్లింలకు వివరించారు.
అమిత్ షా మాస్టర్ స్ట్రోక్ CAA నోటిఫికేషన్ అమలు చేసిన కారణాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.