https://oktelugu.com/

Keerthy Suresh Marriage: స్టార్ కమెడియన్ తో కీర్తి సురేష్ రహస్య వివాహం! కొత్త అల్లుడికి తల్లి మేనక ఫోన్!

కేరళలో రిసార్ట్స్ యజమానితో కీర్తి సురేష్ పెళ్లి అంటూ పుకార్లు రేగాయి. ప్రతిసారి ఈ పుకార్లను కుటుంబ సభ్యులు ఖండిస్తూ వచ్చారు. తాజాగా కోలీవుడ్ కమెడియన్ తో కీర్తి వివాహం జరిగినట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : March 13, 2024 12:30 pm
    Keerthy Suresh secret marriage

    Keerthy Suresh secret marriage

    Follow us on

    Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ రహస్య వివాహం చేసుకుందన్న వార్త కోలీవుడ్ లో సంచలనం రేపింది. స్టార్ కమెడియన్ సతీష్ తో కీర్తి సురేష్ పెళ్లి అయ్యిందట. వాళ్లిద్దరూ పూలదండలు వేసుకుని దిగిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. మరి కీర్తి సురేష్ రహస్య వివాహం వెనకున్న మతలబు ఏమిటీ? అసలు ఏం జరిగిందో? చూద్దాం. కీర్తి సురేష్ పై రూమర్స్ కొత్తేమి కాదు. హీరో విజయ్ తో ఆమె ప్రేమలో పడ్డారంటూ కథనాలు వెలువడ్డాయి. అలాగే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కూడా ఆమెకు ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

    కేరళలో రిసార్ట్స్ యజమానితో కీర్తి సురేష్ పెళ్లి అంటూ పుకార్లు రేగాయి. ప్రతిసారి ఈ పుకార్లను కుటుంబ సభ్యులు ఖండిస్తూ వచ్చారు. తాజాగా కోలీవుడ్ కమెడియన్ తో కీర్తి వివాహం జరిగినట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తల మీద కీర్తి సురేష్ తల్లి స్పందించారు. కీర్తి సురేష్ పెళ్లి వార్తలు మాకు ఆశ్చర్యం తో పాటు వినోదం పంచుతాయి. సతీష్ తో పెళ్లి జరిగిందన్న రూమర్ విని నేను ఫన్నీగా ఫీల్ అయ్యాను. మీడియాలో తప్పుడు ప్రచారం ఎంత వేగంగా జరుగుతుందో చెప్పడానికి ఇది నిదర్శనం అని ఆమె అన్నారు.

    అలాగే కమెడియన్ సతీష్ కూడా ఈ విషయం మీద మాట్లాడారు. కీర్తి సురేష్ తో పెళ్లి వార్తల అనంతరం సతీష్ కి ఆమె తల్లి మేనక నుండి కాల్ వచ్చిందట. సతీష్ ఒకింత భయపడ్డాడట. కాల్ లిఫ్ట్ చేద్దామా వద్దా అనుకున్నాడట. ఫోన్ ఎత్తగానే… మా కీర్తిని పెళ్లి చేసుకున్నందుకు నీకు కంగ్రాట్స్. హ్యాపీగా ఇద్దరూ కాపురం చేసుకోండి, అందట. మేనక ఫోన్ లో చెప్పిన మాటలు విని నవ్వుకున్నానని సతీష్ అన్నాడు.

    నిజానికి కీర్తి సురేష్- సతీష్ వివాహం చేసుకోలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో భైరవ చిత్ర పూజ కార్యక్రమంలో తీసింది. భైరవ లో విజయ్-కీర్తి సురేష్ జంటగా నటించారు. సతీష్ కమెడియన్ రోల్ చేశాడు. అప్పటి ఫోటో వైరల్ చేస్తూ ఎవరో సతీష్-కీర్తి సురేష్ రహస్య వివాహం చేసుకున్నారని ప్రచారం చేశారు. ఈ వార్తలను సతీష్, మేనక తమదైన శైలిలో ఖండించారు. కీర్తి సురేష్ ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. గత ఏడాది తెలుగులో దసరా, భోళా శంకర్ చిత్రాలు చేస్తున్నారు.