Ranbir Kapoor: బాలీవుడ్ లో ‘కపూర్’ ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది. ఫృథ్వీరాజ్ కపూర్ నుంచి ఇప్పటి రణబీర్ కపూర్ వరకు ఎంతో మంది ‘కపూర్ ఫ్యామిలీ వారసులు’ బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఏలారు. హిందీ ఇండస్ట్రీ అంటే కపూర్ ఫ్యామిలీ. కపూర్ ఫ్యామిలీ అంటే హిందీ ఇండస్ట్రీ అనే స్థాయిలో కపూర్ ఫ్యామిలీకి ఎంతో గొప్ప పేరు ఉంది. అందుకే.. కపూర్ ఫ్యామిలీలో రణబీర్ కపూర్ పుట్టగానే సూపర్ స్టార్ పుట్టాడని హిందీ చిత్రసీమ సంబరాలు చేసుకుంది. తాజాగా ఇదే విషయం గురించి రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. తనను తాను ‘జన్యుపరంగా ఒక ‘ఫిల్మీ’ అని చెప్పుకున్నాడు; తాను పుట్టిన వెంటనే, డాక్టర్స్ తన బ్లడ్ గ్రూప్‌ని యు/ఎగా ప్రకటించారని రణబీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

రణబీర్ కపూర్ ప్రస్తుతం చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘షంషేరా’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అభిమానులు ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. బ్లాక్ బస్టర్ ‘సంజు’ను అందించిన నాలుగేళ్ల తర్వాత రణబీర్ ఈ చిత్రంతో మరోసారి సంచనాలను నమోదు చేసేలా ఉన్నాడు. ఈ సినిమా ట్రైలర్ లో తన అద్భుతమైన ఇంటెన్సిటీ తో రణబీర్ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Also Read: Telangana Bjp:బీజేపీ ఆపరేషన్ తెలంగాణ విజయవంతం అవుతుందా?
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోజు రణబీర్ చేత ప్రచార వీడియోలను చేయిస్తున్నారు మేకర్స్. ‘RK టేప్స్’ మొదటి ఎపిసోడ్‌లో, రణబీర్ హిందీ సినిమాపై తనకున్న ప్రేమ గురించి చెబుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను ‘ఫిల్మీ’గా పుట్టానని, అందుకే, తాను పుట్టిన వెంటనే ‘డాక్టర్ తన బ్లడ్ గ్రూప్‌ని యూ/ఏ’గా ప్రకటించాడని రణబీర్ తెలిపారు. U/A అనేది సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ అని తెలిసిన విషయమే.

రణబీర్ ఇంకా మాట్లాడుతూ, “సినిమా హాల్ ప్రపంచానికి ఒక మాయాజాలం. పెద్ద స్క్రీన్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్, పాప్‌కార్న్, మరియు సమోసాల సువాసన… ఇలా ప్రతి సినిమాతో సరికొత్త ప్రపంచాన్ని సినిమా మనకు పరిచయం చేస్తోంది. ఇక నా విషయానికి వస్తే.. “నాలో ఒక బగ్ ఉంది. అది వైరస్ కంటే ప్రాణాంతకమైన బగ్. అది నా పునర్జన్మ యొక్క బగ్, హీరో విలన్‌పై పంచ్ వేసినప్పుడు ‘ధిషూమ్’ అని వచ్చే సౌండ్ ఎఫెక్ట్ బగ్, హీరో ఎంట్రీపై వేసే ‘విజిల్స్’ బగ్, హీరో డైలాగ్ డెలివరీల పై బిగ్గరగా చప్పట్లు కొట్టడం.. ఇలా నాలో ఒక బగ్ ఉంది.
అసలు హిందీ సినిమానే నా బగ్. ఎందుకంటే… నా తల్లిదండ్రులు, తాతలు -ముత్తాతలు, మేనమామలు – అత్తమామలు, నా కజిన్‌లు ఇలా అందరూ నటులు కాబట్టి, ఇది నాకు స్పష్టంగా తెలుస్తోంది. నేను జన్యుపరంగా ‘ఫిల్మీ’ని. అందుకే.. నా బ్లడ్ గ్రూప్ U/A’ అని రణబీర్ చెప్పుకొచ్చారు.

రణబీర్ నటించిన ‘షంషేరా’ కల్పిత తెగకు చెందిన ఒక పురాణగాథ. ఈ చిత్రంలో షంషేరా పాత్రలో రణబీర్ కపూర్ ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో కనిపించబోతున్నాడు. సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నాడు.