Pawan Kalyan: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి గల కారణాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలు వెల్లడించారు. ప్రజల మనోభావాలు గౌరవించకపోతే జరిగే నష్టాలపై వివరించారు. ప్రాంతీయతలను అభిమానించి వారికి కావాల్సిన వాటిని అందజేస్తే ఎలాంటి విభేదాలు రావని చెప్పారు. రెండు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించిన పాలకుల విధానాలే రాష్ట్రం విడిపోవడానికి కారణాలయ్యాయి. అందుకే రెండు ప్రాంతాలుగా ఒకే భాష మాట్లాడే వారు విడిపోవడం గమనార్హం.

ఒకరి యాస, భాషలను మరొకరు పరస్పరం గౌరవించుకోవాలి. లేకపోతే ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయనడంలో సందేహం లేదు. రాష్ట్రం విడిపోవడానికి గల కారణాల గురించి పవన్ కల్యాణ్ తన మనసులోని మాటలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి స్వార్థ ప్రయోజనాలే కారణమని చెబుతున్నారు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి వారి ప్రయోజనాలు సాధించుకునేందుకే మొగ్గు చూపినందు వల్లే రాష్ట్రం ఇలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Telangana Bjp:బీజేపీ ఆపరేషన్ తెలంగాణ విజయవంతం అవుతుందా?
ప్రస్తుత రాజకీయాలు దారి తప్పుతున్నాయి. నేతల్లో సమన్వయం కొరవడుతోంది. పార్టీల్లో విభేదాలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐక్యంగా నడవాల్సి ఉన్నా ఎవరి దారి వారిదే అవుతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పరిస్థితి మారుతోంది. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గుతోంది. ఫలితంగా వారు వంటిళ్లకే పరిమితమవుతున్నారు. వారిలో చైతన్యం తీసుకొచ్చి రాజకీయాల్లో రాణించేలా చూడాల్సిన అవసరం ఏర్పడింది.

ఏపీని ముక్కలు చేసిన ఘనత ఎవరిదో అర్థం అవుతోంది. పాలకుల విధానాలతోనే రాష్ట్రం అధోగతి పాలయింది. అందుకే పాలకుల్లో మార్పు రావాల్సిందని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మన ఆలోచన ధోరణి మారాలి. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కల్యాణ్ చెప్పిన మాటలపై అందరు ఆలోచనలో పడ్డారు. రాష్ట్ర భవిష్యత్ పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని పురోగమనంలో తీసుకెళ్లేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.
Also Read:Heroines Who Lost Husband: ఏంటీ శాపం.. భర్తలను కోల్పోయిన హీరోయిన్ల దీనకథ?
[…] Also Read: Pawan Kalyan: తెలంగాణ, ఏపీ ఎందుకు విడిపోయిందో … […]