Times now Navbharat Survey : దేశంలో మోడీ.. రాష్ట్రంలో మళ్లీ జగన్ రాబోతున్నట్టు తేటతెల్లమైంది. ఈ ఇద్దరు బలమైన నేతలు దేశాన్ని, రాష్ట్రాన్ని మరోసారి పరిపాలించడం గ్యారెంటీ అని దేశంలోనే ప్రముఖ జాతీయ ఛానెల్ ‘టైమ్స్ నౌ’ నిగ్గు తేల్చింది. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ హవా ఇంకా తగ్గలేదని మరో సర్వే వెల్లడించింది. 2024 లోక్ సభ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ‘టైమ్స్ నౌ-నవ భారత్’ సర్వేలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
‘టైమ్స్ నౌ- నవభారత్’ ‘జన్ గన్ కామన్’ పేరుతో సర్వే నిర్వహించింది. దేశంలో ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోయింది. 543 సీట్లలో బీజేపీ కూటమికి 285-325 సీట్లు వస్తాయని సర్వేలో తేలిందని టైమ్స్ నౌ-నవభారత్ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 111-149 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది.
-ఏపీలో జగన్ క్లీన్ స్వీప్..
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజృంభించడం ఖాయమని తేలింది. ఏపీలో 25 సీట్లు ఉంటే అందులో అధికార వైసీపీకి 24-25 సీట్లు అంటే దాదాపు క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేసింది.. తెలుగుదేశం పార్టీకి 0-1 సీట్లు వచ్చే అవకాశం ఉంది. వైసీపీ దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని ఈ సంచలన సర్వే బయటపెట్టింది.
తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీకి 37 శాతం ఓట్లతో 9-11 ఎంపీ సీట్లు వస్తాయని టైమ్స్ నౌ-నవభారత్ వెల్లడించింది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 29.2 శాతం, బీజేపీకి 25.3 శాతం ఓట్లు వస్తాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 20-22 సీట్లు, ఒడిశాలో బీజేడీ పార్టీ 12-14 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది. దేశంలోని కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి 50.30 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది.
మొత్తంగా ఓవరాల్ గా చూస్తే ఏపీలో ఇటు చంద్రబాబు, పవన్ లు కలిసినా పెద్దగా ప్రయోజనం లేదని.. వారు అధికారంలోకి రారు అని తేలింది. ఈ టైమ్స్ నౌ సర్వే తో బాబు, పవన్ లకు గట్టి షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన వారాహి పవన్ యాత్ర.. యువగళం లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు ప్రయాస బూడిదలో పోసిన పన్నీరుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక తెలంగాణలో చూస్తే హంగ్ ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ కు 37 శాతం, కాంగ్రెస్ 29.2, బీజేపీకి 25.3 శాతంతో హంగ్ రావడం తథ్యంలా భావిస్తున్నారు. ఏ రెండు పార్టీలు కలిస్తేనే తెలంగాణలో అధికారం దక్కేలా ఉంది.
If the LS Polls were to be held now, who would get how many seats, in terms of vote share?
BJP – 38.08%
INC – 28.82%
Others – 33.10%@PadmaJaJoshi sheds more light on Times Now – @ETG_Research survey results.@Kamru_Choudhury, @alok_ajay & @ashutosh83B further debate this. pic.twitter.com/MwnOqoXx0v
— TIMES NOW (@TimesNow) July 1, 2023