Pak vs AFG : వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ టీముల మధ్య ఒక భారీ మ్యాచ్ అనేది జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టీం మీద ఆఫ్ఘనిస్తాన్ టీమ్ భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పాకిస్తాన్ వరుస ఓటమిల పరంపరను కొనసాగిస్తూ వస్తుంది. దీంతో పాకిస్తాన్ సెమీస్ అసలు మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిపోయాయి.
ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ టీం సెమీస్ లోకి రావాలి అంటే ఇక మీదట నుంచి ఆడే అన్ని మ్యాచ్ లల్లో గెల్చుకుంటూ రావాలి అదేవిధంగా రన్ రేట్ కూడా విపరీతంగా పెంచుకుంటూ రావాలి. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్థాన్ టీమ్ సెమీస్ కి చేరడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమనే చెప్పాలి. ఇక ఒకసారి ఈ మ్యాచ్ గురించి గనుక పూర్తి వివరాలను తెలుసుకున్నట్లయితే…
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీం నిర్ణీత 50 ఓవర్ల కి 7 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. పాకిస్తాన్ బ్యాట్స్ మెన్స్ లలో షఫీక్, బాబర్ అజమ్, షాదాబ్ ఖాన్,ఐఫ్తికర్ అహ్మద్ ఈ నలుగురు మాత్రమే పాకిస్తాన్ టీంకి గౌరవ ప్రదమైన స్కోరును అందించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇక మొదట గా పాకిస్థాన్ ఓపెనర్ అయిన షఫిక్ 58 పరుగులు చేయగా,బాబర్ అజమ్ 74 పరుగులు చేశాడు. ఇక చివర్లో షాదబ్ ఖాన్, ఐఫ్తికర్ అహ్మద్ చేరో 40 పరుగులు చేయడంతో పాకిస్థాన్ టీమ్ భారీ పరుగులు చేసింది.ఇక దాంతో పాకిస్థాన్ టీమ్ కి గౌరవప్రదమైన స్కోర్ వచ్చింది. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఆఫ్గనిస్తాన్ బౌలర్ల దాటికి పాకిస్తాన్ ప్లేయర్లు ఇబ్బంది పడుతూ ఆడారు.
పాకిస్తాన్ బ్యాట్స్ మెన్స్ ని ముప్పు తిప్పలు పెడుతూ అద్భుతమైన బౌలింగ్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు తమ సత్తా చాటుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీయగా, నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు తీశాడు. అలాగే నబి , అజ్మతుల్లా ఇద్దరూ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక పాకిస్తాన్ టీమ్ ఎక్కువ స్కోర్ చేయకుండా బాల్స్ తో కట్టడి చేసి ఆఫ్ఘనిస్తాన్ టీం అంటే మామూలు టీం కాదని మరోసారి ప్రూవ్ చేశారు…
ఇక 283 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఆఫ్గనిస్తాన్ టీం ఓపెనర్ లలో రెహమానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ ఇద్దరు కూడా చాలా మంచి బ్యాటింగ్ చేస్తూ టీం కి మంచి ఓపెనింగ్ పాత్నర్షిప్ ని అందించారు.ఇక అందులో భాగంగానే వీళ్ళిద్దరూ పాకిస్తాన్ టీమ్ బౌలర్లను మొదటి నుండి దీటుగా ఎదుర్కొంటూ వికెట్ పడకుండా చాలా బాగా ఆడుతూ వచ్చారు. వీళ్లిద్దరూ కలిసి మొదటి వికెట్ కి 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఆ తర్వాత గూర్బాజ్ ఔటవ్వడంతో క్రీజ్ లోకి వచ్చిన రహమత్ కూడా జద్రాన్ తో కలిసి చాలా బాగా ఆడాడు. ఇక వీళ్ళిద్దరూ కలిసి చాలాసేపు క్రీజ్ లో ఉంటూ చాలా మంచి పర్ఫామెన్స్ ని అందించారు. ఇక టీం స్కోర్ 192 పరుగుల వద్ద ఉన్నప్పుడు 87 పరుగులు చేసిన జాద్రాన్ అవుట్ అవ్వడం జరిగింది. అయితే అందరూ జాద్రాన్ సెంచరీ చేస్తాడు అని చాలా మంది సంతోష పడినప్పటికీ అనుకోని పరిస్థితుల్లో తను ఔట్ అవ్వడం జరిగింది.
క్రీజ్ లోకి వచ్చిన షాహిది, రహామత్ తో కలిసి మ్యాచ్ చివర వరకు క్రీజ్ లోనే ఉండి ఇద్దరు చాలా బాగా ఆడుతు నాటౌట్ గా నిలిచారు. ఇక ఆఫ్గనిస్తాన్ టీమ్ 49 ఓవర్లలో 286 పరుగులు చేసి పాకిస్థాన్ మీద అలవోక గెలిచింది.ఇక అఫ్గాన్ ప్లేయర్లలో గుర్బాజ్ 65 పరుగులు చేయగా, జద్రాన్ 87 పరుగులు చేశాడు, రహమత్ 77 పరుగులు చేయగా, సహిది 48 పరుగులు చేశాడు. రేహమత్ , షాహిదీ ఇద్దరు నాటౌట్ గా నిలిచి అఫ్గాన్ టీమ్ ని విజయ్ తీరాలకు చేర్చారు…
పాకిస్తాన్ బౌలర్లలో ఎవరు కూడా అంత మంచి బౌలింగ్ చేయలేదు. అఫ్గాన్ బ్యాట్స్ మెన్స్ దీటుగా ఎదుర్కొంటు వాళ్లకి చాలా బాగా సమాధానం చెప్పారు. 87 పరుగులు చేసిన జద్రాన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రావడంతో ఆయన మాట్లాడుతూ 2021 వ సంవత్సరం లో ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాళిబన్లు సొంతం చేసుకున్నప్పుడు కొంతమంది జనాలు పాకిస్థాన్ వెళ్లి అక్కడ తలదాచుకున్నారు. అలాంటి సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం వేరే దేశం వాళ్లు మన దేశంలో ఉండడానికి వీల్లేదు అంటూ ఆ దేశంలో తలదాచుకున్న 52 వేల మంది అఫ్గాన్ జనాలను తిరిగా ఆఫ్గనిస్తాన్ దేశానికి పంపించడం జరిగింది. దాంతో ఆ సమయం లో తీవ్ర మనస్థాపానికి గురైన జాద్రాన్ పాకిస్తాన్ పై వీరోచితంగా ఆడి ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చిన సందర్భంలో పాకిస్తాన్ దేశం నుంచి తిరిగి వచ్చిన నా దేశ ప్రజలకి ఈ అవార్డ్ ని అంకితం చేస్తున్నాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు. అలాగే పాకిస్థాన్ ప్రభుత్వం మీద వ్యంగంగా సెటైర్లు కూడా వేశాడు. దీంతో అతడు పాక్ పై కోపంతోనే ఇలా పట్టుదలతో ఆడినట్టుగా అర్థమవుతోంది.
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Ibrahim zadran who scored the man of the match award for his better performance against pakistan made sensational comments
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com