Hyper Aadi- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సామాన్య ప్రేక్షకులే కాదు.. సినీ నటులు, ప్రముఖులు కూడా సెల్యూట్ చేస్తారు. ఆయన సేవా కార్యక్రమాలు తెలిసినవారు ఎవరైనా సరే పవన్ ను వేయినోళ్ల కీర్తిస్తారు. బుల్లితెర కమెడియన్ హైపర్ ఆదికి కూడా పవన్ కళ్యాణ్ అంటే పంచప్రాణాలు. నాగబాబును, పవన్ కళ్యాణ్ ను ఆది ఆరాధిస్తుంటాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హైపర్ ఆది పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎందుకు అంత ఇష్టం అన్న ప్రశ్నకు హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఈరోజు ఎవరినైనా డబ్బు మార్చేస్తుంది. పవన్ కళ్యాణ్ కు డబ్బు అంటే అస్సలు ఆసక్తి లేదు. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఎదుటివారికి మంచి చేయాలనే ఆలోచిస్తాడు.సినిమాల నుంచి వచ్చిన సొమ్మును కౌలు రైతులకు సాయం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఒక సినిమా చేస్తే వచ్చే రూ.50 కోట్ల మొత్తాన్ని పేదలకు సాయం చేయడానికి.. పార్టీ కార్యకలాపాలకు.. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి పంచేస్తారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అలాంటిది’ అంటూ పవన్ తీరును హైపర్ ఆది ఆకాశానికెత్తేశాడు.
Also Read: CM KCR: కేసీఆర్‌లో ఎందుకంత టెన్షన్?.. కుటుంబంలో కట్టప్పలు.. షిండేలు నిజమేనా..!?
అందరి మంచి కోరుకునే పవన్ కళ్యాణ్ కు మంచి జరగాలనే తాను కోరుకుంటున్నానని.. అలా జరిగితే ఎంతో సంతోషిస్తామని హైపర్ ఆది తెలిపారు. అందుకే తాను పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం చిన్న వర్క్ కూడా చేస్తున్నానని హైపర్ ఆది వివరించారు.

ఇటీవల హరిహర వీరమల్లు సినిమా పనిమీద ఇటీవల నాలుగురోజులు పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లి వ్యక్తిగతంగా కలిశానని.. ఆయన ఎంత గొప్ప మనిషో అప్పుడు మరింత అర్థమైందని హైపర్ ఆది వివరించాడు.
ఇక పవన్ ఆఫర్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారా? అని హైపర్ ఆదిని ప్రశ్నించగా.. అలాంటిది ఏమీ లేదని హైపర్ ఆది తిరస్కరించారు. కానీ పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధం అంటూ ఆది కొనియాడారు.
Also Read:Anchor Vishnu Priya: బ్రా మాత్రమే ధరించి రెచ్చిపోయిన తెలుగు యాంకర్.. ఇది అందాల అరాచకం
Recommended Videos