Jagan Will Go Early Elections: ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార పార్టీ వైసీపీ ఒకవైపు మరోవైపు టీడీపీ తమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. అధికారమే అంతిమ బాటగా వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అవలంభించాల్సిన వైఖరులపై తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటి నుంచే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన చేసి వారిని జనంలో తిరగాలని సూచిస్తున్నారు. రాబయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించాలని తాపత్రయపడుతున్నారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళికలు రచిస్తున్నారు.

గతంలో చంద్రబాబు అంత తొందరగా టికెట్లు ఇచ్చే వారు కాదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాకే అభ్యర్థులను ఖరారు చేసేవారు. కానీ ఈసారి అలా కాకుండా ముందస్తుగానే అభ్యర్థులను ఖరారు చేసి వారితో ప్రచారం చేయించి ఓట్లు సంపాదించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు పర్యటించే జిల్లాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించి ముందస్తు వ్యూహానికి తెర తీస్తున్నారు.
ప్రణాళికలకు పదును పెడుతున్నారు. ప్రత్యర్థి పార్టీని ఎలా ఎదుర్కోవాలనే దానిపైనే ఫోకస్ పెడుతున్నారు.
చంద్రబాబు పర్యటించే జిల్లాల్లో అక్కడికక్కడే అభ్యర్థి పేరు ప్రకటిస్తున్నారు. విజయం కోసం ముమ్మరంగా ప్రచారం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. దీంతో అభ్యర్థులు తమ విజయం కోసం అహర్నిశలు ప్రచారం చేసుకుని విజయబావుటా ఎగురవేయాలని చెబుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనతో కార్యకర్తలు అందరు ఐక్యంగా ప్రచారం చేసి పార్టీని గెలిపించాలని సూచిస్తున్నారు. అవసరమైతే ఎన్నిసార్లయినా వచ్చి ప్రచారం చేస్తానని చెబుతున్నారు.

టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కూడా తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నాయి. ఒకటి అధికార పక్షం, మరోటి ప్రతిపక్షం కావడంతో పోటీ రసవత్తరంగా మారుతోంది. ఇంకా జనసేన బయటకు రాలేదు. బీజేపీ, జనసేన పార్టీలు వస్తే త్రిముఖ పోరు ఉంటుందా లేక టీడీపీ ఇంకా ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటుందా అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ పొత్తులపై ఇంకా ఆశగానే ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో రాజకీయం మాత్రం రసవత్తరంగా సాగుతోంది. ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్లనున్నారనే సూచనలతోనే ప్రతిపక్ష పార్టీ టీడీపీ అభ్యర్థుల ప్రకటనకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.