CM KCR: తెలంగాణలో ఎనిమిదేళ్లుగా తనకు ఎదురే లేదన్నట్లుగా ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో అణిచివేస్తూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావులో టెన్షన్ మొదలైందా… ఆయన భయపడుతున్నారా.. ప్రెస్‌మీట్‌లో ఆయన ముఖంలో ఆందోళన నిజమేనా అంటే అవుననే అంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజకీయ విశ్లేషకులు. ఎపుపడు ప్రెస్‌మీట్ పెట్టినా ఆహ్లాదంగా, సరదాగా కనిపించే కేసీఆర్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాత్రం మాటల్లో వణుకు, మనసులో బెదురు ఉన్నాయంటున్నారు. అందకు కారణాలను కూడా చెబుతున్నారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన కౌంటర్ సమావేశంలో వెల్లడించిన అంశాలను ఉటంకిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌లో చీలిక తప్పదా!?
ఇటీవలే 20 ఏళ్ల పండుగ జరుపుకున్న తెలంగాణ రాష్ట్ర సమితికి ఉద్యమ సమయం నుంచి చంద్రశేఖర్‌రావు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీలో ఆయన చెప్పిందే వేదం. నచ్చితే అందలం ఎక్కిస్తారు. నచ్చకుంటే అధః పాతాళానికి తొక్కేస్తారు. ఇందుకు ఆలె నరేంద్ర, విజయశాంతి, విజకరామారావు, తాటిపల్లి రాజయ్యతోపాటు మొన్నటి ఈటల రాజేందర్ నిదర్శనం. ఉద్యమ సమయంలో పార్టీలో అందరినీ కలుపుకుపోయిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత టీఆర్‌ఎస్‌ను ఫక్తు రాజకీయ పార్టీలా మార్చారు. గతంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఆకర్షిస్తే చీరి చింతకు కడ్తరు అని మాట్లాడిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను కాంగ్రెస్‌ను చీల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. బీజేపీని రాష్ట్రంలో పెద్దగా పట్టించుకోలేదు. ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసి ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించారు. దీంతో పార్టీలో ఇమడలేని వారు బయటకు వచ్చారు. కొంతమందిని కేసీఆర్ బటయకు పంపించారు. ఈ క్రమంలో ప్రస్తుతం కారులో ఓవర్‌లోడ్ సమస్య ఏర్పడింది.
Also Read: Y S Jagan: జగన్‌కు ఆ ధైర్యం ఉందా.. కేసీఆర్‌తో ‘ముందు’కొస్తాడా?
మరోవైపు కేసీఆర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌థాక్రే మించి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో, పార్టీలో ఏ నిర్ణయమైనా కేసీఆర్ ఒక్కరే తీసుకుంటారు. నచ్చినా నచ్చకపోయినా దానికి అందరూ తలూపాల్సిందే. ఇలాంటి పరిస్థితిలో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలడం, అక్కడి సర్కార్‌కు, టీఆర్‌ఎస్ సర్కార్‌కు దగ్గరి పోలికలు ఉండడంతో త్వరలో టీఆర్‌ఎస్ సర్కార్‌లోనూ తిరుగుబాటు తప్పదన్న వ్యాఖ్యలు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. ఈమేరకు ఇటీవల కేసీఆర్‌కు పార్టీలో కొందరు నేతలు, ఇంటిలిజెన్స్ అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గులాబీ బాస్‌లో గుబులు మొదలైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ చీలిపోతుందన్న భావన కలుగడంతోనే కేసీఆర్ వర్షాలను సాకుగా చూపి ప్రెస్‌మీట్ పట్టి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తీజుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రెస్ మీట్ నిర్వహించి దాదాపు రెండున్నర గంటలు పలు రాజకీయ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.

షిండే ఎవరు.. కట్టప్ప ఎవరు?
టీఆర్‌ఎస్‌లో ఏక్‌నాథ్‌షిండేలు చాలామంది ఉన్నారని, కేసీఆర్ కుటుంబసభ్యుల్లోనూ ఏక్‌నాథ్‌షిండేలు ఉండొచ్చని, అందుకే సీఎం ముఖంలో భయం తాండవిస్తోందని, షిండేల భయం వల్లే కేసీఆర్ పదేపదే మహారాష్ట్ర పరిణామాలను గుర్తుచేసుకుని మాట్లాడుతున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సొంత పార్టీ మనుగడపై కేసీఆర్‌కు భయం పట్టుకుందని, మంచి పార్టీలోకి పోవాలని టీఆర్‌ఎస్ లోని ఏక్‌నాథ్‌షిండేలు ఆలోచిస్తున్నరని చెప్పారు. ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ ముఖంలో కనిపించిన ఆందోళన, తర్వాత కౌంటర్ అటాక్‌లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో కట్టప్ప ఎవరు.., కేసీఆర్ కుటుంబంలో షిండే ఎవర్న చర్చ జరుగుతోంది. ఇంటిలిజెన్స్ ఈమేరకు కొంతమందిని గుర్తించిందన్న ప్రచారం జరగుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఈమేరకు ఈటల రాజేందర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు రెండు రోజుల క్రితం ప్రెస్‌మీట్ నిర్వహించిన ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో తాను గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రకటించారు. ఇంటలిజెన్స్ రిపోర్టు, ఈటల ప్రెస్‌మీట్, పార్టీలో అసంతృప్తి తదితర అంశాల నేపథ్యంలో కేసీఆర్‌లో టీఆర్‌ఎస్‌లో కట్టప్పలను, కుటుంబంలో షిండేలకు ఓ హెచ్చరిక జారీ చేయడానికే ప్రెస్‌మీట్ పెట్టారన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ ప్రెస్‌మీట్ తర్వాత పార్టీలో కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ మొదలైంది.
Also Read:Heavy Rains: తెలంగాణలో రెడ్ అలెర్ట్.. ప్రజలకు కీలకసూచన
[…] […]