మనలో చాలామంది స్నేహితులు, బంధువులకు ఏదైనా అవసరం ఉంటే వాహనాలను ఇస్తూ ఉంటాం. అయితే అలా వాహనం ఇచ్చిన వ్యక్తికి లైసెన్స్ లేకపోతే మాత్రం వాహన యజమాని అరెస్ట్ కావాల్సి ఉంటుంది. తాజాగా ఒక ఘటనలో లైసెన్స్ లేని వ్యక్తికి వాహనం ఇచ్చి వాహన యజమాని అరెస్ట్ అయ్యారు. తెలిసిన వారే కదా అని డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనం ఇస్తే ప్రమాదం జరిగిన సమయంలో మనం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
Also Read: రేషన్ కార్డ్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలో రేషన్ ఏటీఎంలు..?
తాజాగా హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదంలో దంత కళాశాలలో చదువుతున్న విద్యార్థిని రేష్మ లారీ కింద పడి చనిపోయిన సంగతి తెలిసిందే. మదీనాగూడలో ఉన్న జీఎస్‌ఎం మాల్ లో సినిమా చూడటానికి వెళ్లిన రేష్మ సినిమా చూసిన తరువాత స్కూటీపై కేపీహెచ్‌బీకాలనీకి వెళుతున్న సమయంలో పక్క నుంచి మరో వాహనం వేగంగా వెళ్లడంతో ఆమె అదుపు తప్పి కింద పడిపోయింది.
ఆ తరువాత వెనుక వస్తున్న లారీ ముందు టైరు ఆమె పై నుంచి వెళ్లడంతో రేష్మ ఘటనస్థలంలోనే మృతి చెందింది. పోలీసులు ఈ ఘటనలో స్కూటీ యజమాని అజయ్, లారీ డ్రైవర్ కృష్ణలను అరెస్ట్ చేశారు. స్కూటీ ఇచ్చిందుకు పోలీసులు అజయ్ నే ప్రధాన నిందితునిగా పేర్కొని లారీ డ్రైవర్ ను రెండవ నిందితునిగా పేర్కొన్నారు. ఇతరులకు వాహనం ఇచ్చే సమయంలో ఆ వ్యక్తికి లైసెన్స్ ఉందో లేదో కచ్చితంగా తెలుసుకోవాలి.
Also Read: చౌక వడ్డీకే రుణాలు అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు ఇవే!
అవతలి వ్యక్తికి లైసెన్స్ ఉందని కన్ఫామ్ అయితే మాత్రమే వాహనం ఇవ్వాలి. లైసెన్స్ లేని వాళ్లు వాహనం నడిపితే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో వాహన యజమానే నిందితుడయ్యే అవకాశం ఉండటంతో వాహన యజమానులు ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం