స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు అలర్ట్.. కరోనాతో పొంచి ఉన్న ప్రమాదం..?

దేశంలో కోట్ల సంఖ్యలో స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉన్నారు. రోజులో చాలామంది మూడు నుంచి నాలుగు గంటలు స్మార్ట్ ఫోన్ ను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ ను ఎక్కువ సమయం వినియోగిస్తే కూడా కరోనా ప్రమాదం పొంచి ఉండటం గమనార్హం. శాస్త్రవేత్తలు గతేడాది శరవేగంగా విజృంభించిన కరోనా మహమ్మారి గురించి అనేక పరిశోధనలు చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ బాహ్య ప్రపంచంలో ఎంత సమయం జీవిస్తుందనే పరిశోధనలు […]

Written By: Kusuma Aggunna, Updated On : February 23, 2021 12:13 pm
Follow us on

దేశంలో కోట్ల సంఖ్యలో స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉన్నారు. రోజులో చాలామంది మూడు నుంచి నాలుగు గంటలు స్మార్ట్ ఫోన్ ను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ ను ఎక్కువ సమయం వినియోగిస్తే కూడా కరోనా ప్రమాదం పొంచి ఉండటం గమనార్హం. శాస్త్రవేత్తలు గతేడాది శరవేగంగా విజృంభించిన కరోనా మహమ్మారి గురించి అనేక పరిశోధనలు చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తాజాగా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ బాహ్య ప్రపంచంలో ఎంత సమయం జీవిస్తుందనే పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో స్మార్ట్ ఫోన్ స్క్రీన్లపై కరోనా వైరస్ ఎక్కువ సమయం జీవిస్తుందని వెల్లడైంది. సాధారణ గాజు గ్లాస్‌ ఉపరితలం కంటే స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌పైనే కరోనా వైరస్ ఎక్కువ కాలం జీవిస్తుందని హైదరాబాద్ ఐఐటీకి చెందిన ఇంటర్‌ డిసిప్లనరీ రీసెర్చ్‌ గ్రూప్‌ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది.

తుమ్మడం, దగ్గడం ద్వారా స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై చేరిన కరోనా వైరస్ ఫోన్ స్క్రీన్ ను టచ్ చేస్తే వారికి కూడా కరోనా సోకే అవకాశాలు ఉంటాయి. ఐఐటీ పరిశోధకులు కరోనా వైరస్ జీవితకాలం వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరుగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మెకానికల్‌, ఏరో స్పేస్‌ విభాగం శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం గమనార్హం.

దేశంలోని పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 10,584 కొత్త కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. కేసుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా కరోనా కేసులతో పోలిస్తే రికవరీలు ఎక్కువగా ఉన్నాయి.