దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లు మాత్రమే వాహనాలు నడపటానికి అర్హులనే సంగతి తెలిసిందే. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపితే కొన్ని సందర్భాల్లో జరిమానా మరికొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. అయితే డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన నియమనిబంధనల్లో కీలక మార్పులు జరిగాయి. సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే కనీసం ఎనిమిదో తరగతి చదివి ఉండాలి.
Also Read: ప్రభుత్వం బంపర్ ఆఫర్.. పెళ్లి చేసుకునే అమ్మాయిలకు రూ. 3లక్షలు..?
ఎనిమిదో తరగతి కంటే తక్కువ చదివితే డ్రైవింగ్ లైసెన్స్ ను పొందలేరు. అయితే ఇకపై విద్యార్హత లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ ను పొందవచ్చు. కేంద్ర మోటార్ వెహికిల్ యాక్ట్ లో ఈ మేరకు కీలక మార్పులు జరిగాయి. కేంద్ర రవాణా శాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేంద్ర మోటార్ వెహికిల్ యాక్ట్ లో నిబంధనలు సవరించడంతో విద్యార్హత లేకపోవడం వల్ల లైసెన్స్ పొందలేని వారికి ప్రయోజనం చేకూరనుంది.
Also Read: బైక్ నడిపే వారికి షాకింగ్ న్యూస్.. హెల్మెట్ విషయంలో కొత్త నిబంధనలు..?
రవాణాశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కొత్త రూల్ ను తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు అందడంతో ఇకపై సులభంగానే లైసెన్స్ ను పొందే అవకాశం కలుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలతో పాటు లైసెన్స్ రెన్యూవల్ కు సంబంధించిన నియమనిబంధనలలో సైతం కీలక మార్పులు జరిగాయి.
మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం
ఇకపై 40 సంవత్సరాలు దాటిన వాళ్లు లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలంటే కచ్చితంగా మెడికల్ సర్టిఫికెట్ ను జత చేయాలి. గడువు ముగిసి సంవత్సరమైనా రెన్యూవల్ చేసుకోకపోతే లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉంటుంది. మళ్లీ వాహనదారులు లెర్నింగ్ లైసెన్స్ ను తీసుకోవాల్సి ఉంటుంది. లైసెన్స్ విషయంలో మారిన నిబంధనలను వాహనదారులు గుర్తుంచుకోకపోతే ఇబ్బందులు పడక తప్పదు.