వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఆ తప్పు చేస్తే అకౌంట్ డిలీట్..?

ప్రపంచ దేశాల్లో నంబర్ 1 మెసేజింగ్ యాప్ గా వాట్సాప్ కు పేరుంది. మన దేశంలో కోట్ల సంఖ్యలో వినియోగదారులు వాట్సాప్ యాప్ ను వినియోగిస్తున్నారు. వాట్సాప్ ద్వారా సందేశాలు పంపడంతో పాటు ఆడియో కాల్స్, వీడియో కాల్స్, ఇతర అద్భుతమైన ఫీచర్లు ఉండటం వల్ల ఈ యాప్ ను ఎక్కువమంది వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. గతేడాది ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ ఈ ఏడాది మరికొన్ని ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. Also […]

Written By: Navya, Updated On : January 6, 2021 5:12 pm
Follow us on

ప్రపంచ దేశాల్లో నంబర్ 1 మెసేజింగ్ యాప్ గా వాట్సాప్ కు పేరుంది. మన దేశంలో కోట్ల సంఖ్యలో వినియోగదారులు వాట్సాప్ యాప్ ను వినియోగిస్తున్నారు. వాట్సాప్ ద్వారా సందేశాలు పంపడంతో పాటు ఆడియో కాల్స్, వీడియో కాల్స్, ఇతర అద్భుతమైన ఫీచర్లు ఉండటం వల్ల ఈ యాప్ ను ఎక్కువమంది వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. గతేడాది ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ ఈ ఏడాది మరికొన్ని ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

Also Read: షియోమీ ఫోన్ కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్..?

అయితే ఈ ఏడాది వాట్సాప్ యాప్ యూజర్లకు టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ అప్ డేట్ ను అందుబాటులోకి తెచ్చింది. టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ అప్ డేట్ వల్ల ఇకపై ఎవరైతే ఈ నియమనిబంధనలు పాటిస్తారో వారికి మాత్రమే వాట్సాప్ యాప్ ను వినియోగించడానికి సాధ్యమవుతుంది. నియమనిబంధనలకు అంగీకరించకపోతే వాట్సాప్ యాప్ డిలేట్ అవుతుంది. వాట్సాప్ తన బ్లాగ్ వాబీటా ఇన్ఫో లో ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.

Also Read: వాట్సాప్ యాప్ వాడుతున్నారా.. ఈ ట్రిక్స్ గురించి మీకు తెలుసా..?

వాట్సాప్ వినియోగదారులకు దశల వారీగా సంస్థ ఈ నియమ నిబంధనలను పంపనుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా వాట్సాప్ యూజర్లలో కొంతమంది తమకు నియమ నిబంధనలకు సంబంధించిన అప్ డేట్ వచ్చిందని తాము యాక్సెప్ట్ చేశామని పేర్కొన్నారు. 2014 సంవత్సరంలో వాట్సాప్ ను ఫేస్ బుక్ సంస్థ కొనుగోలు చేసింది. అయితే వాట్సాప్ కొత్తగా నియమనిబంధనలను తీసుకురావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తల కోసం: మొబైల్స్

ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం గత కొంతకాలం నుంచి వాట్సాప్ యాప్ కు సంబంధించి డేటా భద్రత, గోప్యతకు సంబంధించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాట్సాప్ యాప్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.