https://oktelugu.com/

చంద్రబాబు, లోకేష్.. టీడీపీ మీడియా పరువు తీసిన కొడాలి నాని

మంత్రి కొడాలి నాని మరోసారి పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. నోటికి ఏదో వస్తే అది మాట్లాడేశాడు.. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ తోపాటు టీడీపీ మీడియాను ఉతికి ఆరేశాడు.. మంత్రి కొడాలి నాని పేరు వింటేనే ఇప్పుడు వీరంతా హడలి చస్తున్న పరిస్థితి నెలకొంది. గుడివాడలో మరోసారి మంత్రి కొడాలి నాని రెచ్చిపోయాడు. Also Read: ట్విట్టర్ ద్వారానే పవన్ ‘రామతీర్థం’ నిరసన? ఏపీలోని విగ్రహాల విధ్వంసంపై రాజకీయం చేస్తున్న చంద్రబాబు, లోకేష్, […]

Written By:
  • NARESH
  • , Updated On : January 6, 2021 / 05:06 PM IST
    Follow us on

    మంత్రి కొడాలి నాని మరోసారి పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. నోటికి ఏదో వస్తే అది మాట్లాడేశాడు.. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ తోపాటు టీడీపీ మీడియాను ఉతికి ఆరేశాడు.. మంత్రి కొడాలి నాని పేరు వింటేనే ఇప్పుడు వీరంతా హడలి చస్తున్న పరిస్థితి నెలకొంది. గుడివాడలో మరోసారి మంత్రి కొడాలి నాని రెచ్చిపోయాడు.

    Also Read: ట్విట్టర్ ద్వారానే పవన్ ‘రామతీర్థం’ నిరసన?

    ఏపీలోని విగ్రహాల విధ్వంసంపై రాజకీయం చేస్తున్న చంద్రబాబు, లోకేష్, టీడీపీ మీడియాపై మంత్రి కొడాలనాని బూతులతో విరుచుకుపడ్డారు. మీకు దమ్ముంటే మగాళ్లయితే జగన్ పైన కాదు.. తనపై ఎపిసోడ్లకు ఎపిసోడ్లు ప్రోగ్రాంలు చేయండని ఏబీఎన్, టీవీ5, ఈనాడు సంస్థల అధినేతలకు కొడాలి నాని వార్నింగ్ ఇచ్చాడు.

    అంతేకాదు.. అధికారం కోసం ఎంతకైనా దిగజారే చంద్రబాబు అసలు మనిషి కాదంటూ కొడాలి నాని ఈసడించుకున్నారు. 74 ఏళ్ల వచ్చినా.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా ఇంకా కులాలు, మతాల గురించి మాట్లాడుతావా అంటూ చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు.

    Also Read: చంద్రబాబుకు ‘కరోనా’ భయం

    ఇక సీఎం జగన్ ను క్రిస్టియన్ అంటూ మాట్లాడడం ఘోరమని.. చంద్రబాబు లాంటి నేతలు ప్రమాణం చేసి కూడా ఇలా వ్యవహరిస్తారని నిప్పులు చెరిగారు. నీచ రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని.. ప్రజలు భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చాడు.

    ఇక లోకేష్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన మంత్రి కొడాలి నాని.. అతడికి కొత్త పేరు పెట్టాడు.. జగన్ గురించి మిడత లాంటి లోకేష్ మాట్లాడడం ఏంటని కడిగేశాడు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్