https://oktelugu.com/

మీ పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతా ఉందా.. ఎలా డిలేట్ చేయాలంటే..?

ఈ మధ్య కాలంలో నకిలీ ఫేస్ బుక్ ఖాతాల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సెలబ్రిటీలతో పాటు స్ సామాన్యులకు కూడా నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తలనొప్పిగా మారాయి. నకిలీ ఫేస్ బుక్ ఖాతాలకు ఫోటోలను ఉపయోగించి సైబర్ మోసగాళ్లు డబ్బులు అవసరం ఉందని.. సహాయం చేస్తే మళ్లీ ఇచ్చేస్తామని అసలు ఖాతా ఉన్న వ్యక్తి యొక్క స్నేహితులు, బంధువులకు మెసేజ్ లు పెడుతున్నారు. Also Read: bఫోన్ నంబర్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వచ్చిందా.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 5, 2021 / 04:00 PM IST
    Follow us on

    Facebook Account

    ఈ మధ్య కాలంలో నకిలీ ఫేస్ బుక్ ఖాతాల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సెలబ్రిటీలతో పాటు స్ సామాన్యులకు కూడా నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తలనొప్పిగా మారాయి. నకిలీ ఫేస్ బుక్ ఖాతాలకు ఫోటోలను ఉపయోగించి సైబర్ మోసగాళ్లు డబ్బులు అవసరం ఉందని.. సహాయం చేస్తే మళ్లీ ఇచ్చేస్తామని అసలు ఖాతా ఉన్న వ్యక్తి యొక్క స్నేహితులు, బంధువులకు మెసేజ్ లు పెడుతున్నారు.

    Also Read: bఫోన్ నంబర్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వచ్చిందా.. తస్మాత్ జాగ్రత్త..!

    ఫోటో ఉండటంతో మెసేజ్ వచ్చిన వ్యక్తులకు ఎటువంటి అనుమానం కలగడం లేదు. సైబర్ మోసగాళ్లు తమ బ్యాంక్ అకౌంట్ లో ఏదో సమస్య ఉందని చెప్పి వేరే బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వడం లేదా ఇతర యూపీఐ అకౌంట్ నంబర్లను ఇస్తున్నారు. డబ్బులు అందుకున్న తరువాత అసలు వ్యక్తి యొక్క స్నేహితులు, బంధువులు అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. అయితే ఫేస్ బుక్ ఇలాంటి మోసాలకు చెక్ పెట్టే అవకాశం కల్పిస్తోంది.

    Also Read: కంప్యూటర్ కీ బోర్డుపై అక్షరాలు వరుస క్రమంలో ఎందుకుండవో తెలుసా..?

    నకిలీ ఫేస్ బుక్ ఖాతాను తొలగించాలంటే నకిలీ ఫేస్ బుక్ ఖాతా పైన ఉండే మూడు చుక్కలు ఉంటాయి. ఆ మూడు చుక్కలపై క్లిక్ చేస్తే రిపోర్ట్ ఆప్షన్ వస్తుంది. అందులో 20 మంది ఈ పోస్టును డిలీట్ చేయండి అని టైప్ చేయాలి. ఫేస్ బుక్ ఆ మెసేజ్ లను గుర్తించి నకిలీ ఫేస్ బుక్ ఖాతాను డిలేట్ చేయవచ్చు. సైబర్ మోసగాళ్లు హైదరాబాద్ కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ పేరుపై నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ను క్రియేట్ చేశారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఆ ఫేస్ బుక్ అకౌంట్ లో సైబర్ మోసగాడు ఏసీపీ స్నేహితునికి నమస్కార్ జీ అనే మెసేజ్ పెట్టాడు. ఆ స్నేహితుడు నకిలీ ఫేస్ బుక్ ఖాతా నుంచి మెసేజ్ వచ్చినట్టు ఏసీపీకి సమాచారం ఇచ్చాడు. ఆ తరువాత 20 మందితో నకిలీ ఖాతా ఐడీలో డిలీట్ పోస్టు అని టైప్ చేయించి ఖాతా డిలేట్ అయ్యేలా చేశారు.