సినిమా ట్రైలర్ టాక్: ‘పిట్టకథలు’ !

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ మొట్ట మొదటి తెలుగు ఆంథాలజీ సిరీస్ “పిట్టకథలు” ట్రైలర్ బయటకు వచ్చింది. మహిళలకు సంబంధించిన అంశాలను ఈ సిరీస్‌లో బోల్డ్‌గా చర్చిస్తూ అందులో భాగంగా మహిళా సాధికారతను, మహిళలు ఎదుర్కొనే సమస్యలను ఇందులో విశ్లేషాత్మకంగా చూపించారు. ఇక ఈ నెల 19 నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌ లో అందుబాటులో ఉంది. ఇక ఈ సిరీస్‌ లోని నాలుగు కథలను నలుగురు ప్రముఖ దర్శకులు తెరకెక్కించారు. Also Read: […]

Written By: admin, Updated On : February 5, 2021 4:20 pm
Follow us on


ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ మొట్ట మొదటి తెలుగు ఆంథాలజీ సిరీస్ “పిట్టకథలు” ట్రైలర్ బయటకు వచ్చింది. మహిళలకు సంబంధించిన అంశాలను ఈ సిరీస్‌లో బోల్డ్‌గా చర్చిస్తూ అందులో భాగంగా మహిళా సాధికారతను, మహిళలు ఎదుర్కొనే సమస్యలను ఇందులో విశ్లేషాత్మకంగా చూపించారు. ఇక ఈ నెల 19 నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌ లో అందుబాటులో ఉంది. ఇక ఈ సిరీస్‌ లోని నాలుగు కథలను నలుగురు ప్రముఖ దర్శకులు తెరకెక్కించారు.

Also Read: రివ్యూ : ‘జాంబి రెడ్డి’ – వింత అనిపించినా అక్కడక్కడా బాగుంది !

ఆ నలుగురు టాలెంటెడ్ డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, ఈ నలుగురూ ఈ సిరీస్‌లోని నాలుగు భాగాలను రూపొందించారు. ఈ సిరీస్ లో ఈషా రెబ్బా – సాన్వే మేఘన – అమలా పాల్‌ – శృతిహాసన్‌ ప్రధాన పాత్రల్లో నటించడం, పైగా బోల్డ్ సీన్స్ లో వాళ్ళు కనిపిస్తుండటంతో దీని పై అందరికీ ఆసక్తి ఏర్పడింది. ఇక ఇటీవలే నెట్ ఫ్లిక్స్ ఈ తెలుగు ఆంథాలజీని అధికారికంగా ప్రకటించి రిలీజ్ చేసిన టీజర్ కూడా బాగా వైరల్ అవ్వడంతో దీని పై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: ఏ.ఎం.రత్నం గారిని మాత్రమే సినిమా అడిగాను: పవన్ కళ్యాణ్

కాగా జగపతిబాబు – అమలా పాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మీరా’ స్టోరీని నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. శృతి హాసన్ లీడ్ రోల్ లో రూపొందిన ‘ఎక్స్ లైఫ్’ కథకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈషా రెబ్బా – సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పింకీ’ విభాగానికి సంజల్ప్ రెడ్డి దర్శకత్వం వహించాడు. భిన్నమైన సంస్కృతుల్ని ఆవిష్కరిస్తూ తీసిన ఈ సినిమాలో మహిళా సాధికారతతో పాటు మానవ సంబంధాల్ని సహజంగా కొత్త కోణంలో చూపిస్తున్నారట. ఇది హిందీ ‘లస్ట్ స్టోరీస్’ తరహాలో ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్