https://oktelugu.com/

చినిగిపోయిన రూ.2000, రూ.500 నోట్లు ఉన్నాయా.. ఎలా మార్చుకోవాలంటే..?

మనలో చాలామంది కరెన్సీ నోట్లు కొన్ని సందర్భాల్లో చినిగిపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. తక్కువ మొత్తం విలువ ఉన్న కరెన్సీ నోట్లు చినిగిపోయినా సమస్య లేదు కానీ 2000 రూపాయలు, 500 రూపాయల నోట్లు చినిగిపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. అయితే బ్యాంకుల ద్వారా సులభంగా చినిగిపోయిన నోట్లను మార్చుకొని కొత్త నోట్లను పొందవచ్చు. అయితే చినిగిపోయిన నోట్లను మార్చుకోవడానికి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. Also Read: వాహనధారులకు షాకింగ్ న్యూస్.. ఆ తప్పు చేస్తే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 3, 2021 / 06:43 PM IST
    Follow us on

    మనలో చాలామంది కరెన్సీ నోట్లు కొన్ని సందర్భాల్లో చినిగిపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. తక్కువ మొత్తం విలువ ఉన్న కరెన్సీ నోట్లు చినిగిపోయినా సమస్య లేదు కానీ 2000 రూపాయలు, 500 రూపాయల నోట్లు చినిగిపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. అయితే బ్యాంకుల ద్వారా సులభంగా చినిగిపోయిన నోట్లను మార్చుకొని కొత్త నోట్లను పొందవచ్చు. అయితే చినిగిపోయిన నోట్లను మార్చుకోవడానికి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి.

    Also Read: వాహనధారులకు షాకింగ్ న్యూస్.. ఆ తప్పు చేస్తే భారీ జరిమానా..?

    10 రూపాయల నోటు నుంచి 2,000 రూపాయల నోటు వరకు చినిగిపోయినా మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే కరెన్సీ నోటులో మిగిలి ఉన్న భాగాన్ని బట్టే డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. 2,000 రూపాయల నోటు విషయానికి వస్తే నోటు అసలు పరిమాణంలో కనీసం 88 శాతం ఉంటే మాత్రమే పూర్తి విలువతో మరో నోటును పొందవచ్చు. అలా కాకుండా 44 శాతం నుంచి 88 శాతం మధ్యలో చిరిగిన నోటు ఉంటే సగం విలువను పొందవచ్చు.

    Also Read: ఆ ప్రాంతంలో కళ్లు తెరిచిన శివలింగం.. పూజారి ఏమన్నారంటే..?

    500 రూపాయల నోట్ల విషయంలో కూడా 88 శాతం ఉంటే పూర్తి విలువతో మరో నోటును పొందే అవకాశం ఉండగా 44 శాతం నుంచి 88 శాతం మధ్య ఉంటే సగం విలువను పొందవచ్చు. అయితే 200 రూపాయల నోటు విషయంలో మాత్రం ఈ నిబంధనలు వేరే విధంగా ఉంటాయి. 200 రూపాయల నోటు 39 శాతం నుంచి 78 శాతం మధ్యలో ఉంటే సగం డబ్బులు, 78 శాతం కంటే ఎక్కువ ఉంటే పూర్తి డబ్బులు పొందవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    10, 20, 100 రూపాయల నోట్లను కూడా కరెన్సీ విలువను బట్టి మార్చుకునే అవకాశం ఉంటుంది. చిరిగిన నోట్లు ఉంటే సమీపంలోని బ్యాంకులను సంప్రదించి చినిగిపోయిన నోటులో మిగిలి ఉన్న భాగాన్ని బట్టి డబ్బులను పొందవచ్చు.