Ladakh Election Result : లడఖ్ ఎన్నికల ఫలితంపై కాంగ్రెస్ అంతగా చంకలు గుద్దు కోవాల్సిందేముంది?

ఈ క్రమంలోనే లఢక్ లో రెండు అటానమస్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఇవి ఏంటి? లడఖ్ ఎన్నికల ఫలితంపై కాంగ్రెస్ అంతగా చంకలు గుద్దు కోవాల్సిందేముంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణ

Written By: NARESH, Updated On : October 10, 2023 8:08 pm

ladakh election Result

Follow us on

Ladakh Election Result : లడఖ్ అటానమస్ కౌన్సిల్ కు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో నేషనల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు ఘనవిజయం సాధించాయి. దానికి ముక్తయింపు ఏంటంటే.. రాహుల్ గాంధీ లఢక్ వెళ్లాడు కాబట్టి ఎన్నికలు మొత్తం మాకు అనుకూలంగా వచ్చాయని ప్రెస్ మీట్ లో జైరాం రమేష్ ఊదరగొట్టాడు. ఇలా మిస్ లీడ్ చేయడంలో కాంగ్రెస్ ఎప్పుడూ దిట్ట. అసలు ఏంటి అటానమస్ కౌన్సిల్ ఎన్నికలు ? వీటి కథేంటి? గెలిస్తే ప్రయోజనం ఏంటన్నది తెలుసుకుందాం.

జమ్మూ కశ్మీర్ ను 2019 ఆగస్టు 5న రెండుగా విభజించింది మోడీ సర్కార్. జమ్మూకశ్మీర్ ఒకటి.. లఢక్ మరొకటి. జమ్మూకశ్మీర్ కు అసెంబ్లీ స్టాటస్ ఇచ్చి ముందు ముందు రాష్ట్రం చేస్తారని హామీ ఇచ్చారు. లఢక్ ను రాష్ట్రంగా చేస్తామనలేదు. కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంటుందని చెప్పింది. ఎన్నికైన అసెంబ్లీ కూడా ఇవ్వడం లేదని బీజేపీ స్పష్టం చేసింది.

సహజంగానే లఢక్ లో ప్రజలు దీనిపై కోపంగా ఉన్నారు. సెక్యూరిటీ యాంగిల్ లో కేంద్రం చెప్పు చేతుల్లో ఉండాలనే బీజేపీ ఇలా చేసింది. అయితే ప్రజలు మాత్రం తమకు రాష్ట్రంగా ఎమ్మెల్యే సీట్లు, ప్రజాప్రతినిధులు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే లఢక్ లో రెండు అటానమస్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఇవి ఏంటి? లడఖ్ ఎన్నికల ఫలితంపై కాంగ్రెస్ అంతగా చంకలు గుద్దు కోవాల్సిందేముంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.