https://oktelugu.com/

4జీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోవాలా.. ట్రిక్స్ ఇవే..?

ప్రపంచ దేశాలు 5జీపై ప్రధానంగా దృష్టి పెట్టగా మన దేశంలోని చాలా ప్రాంతాల ప్రజలు 4జీ డేటా స్పీడ్ తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్ టవర్ నుంచి ఉన్న దూరం, 4జీ మొబైల్ టవర్ ను వినియోగిస్తున్న వినియోగదారుల సంఖ్యను బట్టి ఇంటర్నెట్ స్పీడ్ ఆధారపడి ఉంటుంది. పగలు సమయంతో పోలిస్తే రాత్రి సమయంలో డేటా స్పీడ్ తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని ట్రిక్స్ పాటించడం ద్వారా డేటా స్పీడ్ ను పెంచుకోవచ్చు. Also […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 11, 2021 / 06:11 PM IST
    Follow us on

    ప్రపంచ దేశాలు 5జీపై ప్రధానంగా దృష్టి పెట్టగా మన దేశంలోని చాలా ప్రాంతాల ప్రజలు 4జీ డేటా స్పీడ్ తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్ టవర్ నుంచి ఉన్న దూరం, 4జీ మొబైల్ టవర్ ను వినియోగిస్తున్న వినియోగదారుల సంఖ్యను బట్టి ఇంటర్నెట్ స్పీడ్ ఆధారపడి ఉంటుంది. పగలు సమయంతో పోలిస్తే రాత్రి సమయంలో డేటా స్పీడ్ తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని ట్రిక్స్ పాటించడం ద్వారా డేటా స్పీడ్ ను పెంచుకోవచ్చు.

    Also Read: ఒక్కసారి చెల్లిస్తే జీవితకాలం పెన్షన్ పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

    మొబైల్ లో ఉండే నెట్ వర్క్ సిగ్నల్ సెట్టింగ్స్ వల్ల కొన్నిసార్లు డేటా స్పీడ్ తక్కువగా ఉంటుంది. 4జీ వోఎల్టీఈ కనెక్టివిటీతో పని చేసే మొబైల్ ఫోన్ల సంఖ్య పెరగడం కూడా ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉండటానికి కారణమని చెప్పవచ్చు. పరిమిత పరిధిలో స్పెక్ట్రమ్ ఫలితంగా ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. డేటా స్పీడ్ ను పెంచుకోవాలనుకుంటే మొదట ఫోన్ సెట్టింగులకు వెళ్లి మొబైల్ నెట్వర్క్ ల ద్వారా 4జీని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది.

    Also Read: ఏప్రిల్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు తగ్గనున్న జీతాలు.. కానీ..?

    ఆ తరువాత ఫోన్ నెట్ వర్క్ సెట్టింగుకు వెళ్లి యాక్సెస్ పాయింట్ల పేర్లను క్లిక్ చేయడంతో పాటు ఏపీఎన్ ను డిఫాల్టుగా రీసెట్ చేయాలి. మొబైల్ ఫోన్ లో తరచూ వినియోగించే యాప్స్ ను మాత్రమే ఉంచుకోవాలి. అవసరం లేని ఎక్కువగా వినియోగించని యాప్స్ ను వెంటనే డిలేట్ చేస్తే మంచిది. బ్యాక్ గ్రౌండ్ డేటా ఆప్షన్ ను నిలిపివేయడం ద్వారా కూడా ఇంటర్నెట్ వేగాన్ని తగ్గించుకోవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఈ ట్రిక్స్ పాటించినా ఇంటర్నెట్ వేగంగా రాకపోతే ఒకసారి ఫోన్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మంచిది. నెట్వర్క్ సెట్టింగ్స్ ను రీసెట్ చేయడం ద్వారా కూడా ఇంటర్నెట్ స్పీడ్ ను పెంచుకోవచ్చు.