https://oktelugu.com/

బిగ్ బ్రేకింగ్: పవన్-క్రిష్ మూవీ టైటిల్ ఇదే.. వీడియో గూస్ బాంబ్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ శివరాత్రి పండుగకు మరిచిపోలేని గొప్ప శుభవార్తను చెప్పారు దర్శకుడు క్రిష్. నిన్నా మొన్నటిదాకా కనీసం పేరు కూడా పెట్టని సినిమా నుంచి ఏకంగా సినిమా పేరుతోపాటు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 27వ చిత్రం పేరు, కథ ఏంటనేది బయటపడింది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా మహాశివరాత్రి సందర్భంగా చిత్ర బృందం టైటిల్ , ఫస్ట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 11, 2021 / 06:34 PM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ శివరాత్రి పండుగకు మరిచిపోలేని గొప్ప శుభవార్తను చెప్పారు దర్శకుడు క్రిష్. నిన్నా మొన్నటిదాకా కనీసం పేరు కూడా పెట్టని సినిమా నుంచి ఏకంగా సినిమా పేరుతోపాటు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు.

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 27వ చిత్రం పేరు, కథ ఏంటనేది బయటపడింది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా మహాశివరాత్రి సందర్భంగా చిత్ర బృందం టైటిల్ , ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

    ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ తో పవన్ కళ్యాణ్ లుక్ ను అభిమానులతో పంచుకున్నారు. టైటిల్ ఫస్ట్ లుక్ ను బట్టి చూస్తుంటే మునుపెన్నడూ కనిపించని విధంగా సరికొత్త పాత్రలో పవన్ కనిపించనున్నట్టు తెలుస్తోంది.

    చారిత్రక వీరుడిగా పవన్ కనిపించనున్నారు. పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో పవన్ ‘వజ్రాల’ దొంగగా కనిపించనున్నట్టు సమాచారం. పవన్ సరసన నిధి అగర్వాల్ సందడి చేయనుంది. చిత్రీకరణ పనులు సాగుతున్నాయి. కీరవాణి సంగీతం అందిస్తుననారు. ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీల్లో విడుదల చేయనున్నారు.