Homeఅంతర్జాతీయంHot Places In World: క్షణాల్లో నీరు ఆవిరి.. ప్రపంచంలోనే అత్యంత మండిపోయే ప్రదేశాలు...

Hot Places In World: క్షణాల్లో నీరు ఆవిరి.. ప్రపంచంలోనే అత్యంత మండిపోయే ప్రదేశాలు ఇవీ!

Hot Places In World: సమ్మర్‌ వచ్చిందంటే చాలు.. ఎండల తీవ్రతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక రోహిణీ కార్తె ఏకంగా ప్రాణాలే తీసేస్తుంది. ప్రస్తుతం దేశంలో భానుడు భగ్గుమంటున్నాడు. వడగాలులు వీస్తున్నాయి. జనం అల్లాడుతున్నారు. మూగ జీవాలు సైతం తల్లడిల్లుతున్నాయి. మృత్యువాత పడుతున్నాయి. మరి 45 డిగ్రీల వేడికే మనం ఇలా ఉంటే.. అత్యధిక వేడి ప్రదేశాల్లో ఎలా ఉంటుంది.. భూమ్మీద అలాంటి ప్రదేశాలు ఉన్నాయా? అక్కడ వేడి ఎంత ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం.

డెత్‌ వ్యాలీ…
– ఉత్తర అమెరికా.. పశ్చిమాన ఉండే.. కాలిఫోర్నియాలో ఉన్న డెత్‌ వ్యాలీ… భూమిపై అత్యంత వేడి ప్రదేశంగా ఉంది. ఇక్కడ 1913లో అత్యధికంగా 56 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఆధునిక కాలంలో భూమి ఉపరితలంపై ఇదే అత్యధిక ఉష్ణోగ్రత.

ఆస్ట్రేలియాలో..
నదులు లేని ఆస్ట్రేలియా.. సహజంగానే వేడిగా ఉంటుంది. ఇక అక్కడి ఉడ్నడట్టాలో అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. 1960లో అక్కడ 50 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. దక్షిణార్థ గోళంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా ఉంది.

కెబిలీలో..
ట్యునీషియాలోని కెబిలీ అనే ప్రదేశం చాలా వేడిగా ఉంటుంది. అక్కడ 1931, జులైలో 55 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పు అర్థ గోళంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇది.

మిత్రిబాలో..
కువైట్‌ ఈ దేశం పేరు వినగానే వేడి మనకు తాకినట్లు అనిపిస్తుంది. ఈ దేశంలోని మిత్రిబా అనే ప్రదేశంలో నిమిషం కూడా ఉండలేం. అక్కడ 2016 జులైలో.. 53.88 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

తుర్బాత్‌లో..
పాకిస్థాన్‌లోని తుర్బాత్‌ కూడా హాట్‌ ప్లేసే. అక్కడ 2017 మేలో… 53.72 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఆసియాలో నమోదైన అతి తీవ్ర ఉష్ణోగ్రతల్లో ఇది ఒకటిగా నిలిచింది.

అర్జెంటీనాలో..
– దక్షిణ అమెరికాలోని… అర్జెంటినాలో.. చుబుత్‌కి చెందిన పెటగోనియా ప్రావిన్స్‌లోని రివడావియాకి వెళ్లాలి అని అనుకోకండి. అక్కడ 1905 ,డిసెంబర్‌లో 48.88 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదై చుక్కలు చూపించింది.

తిరాత్‌స్వీ..
1942 జూన్‌లో ఇజ్రాయెల్‌ లోని తిరాత్‌ స్వీ ప్రాంత ప్రజలు షాక్‌ అయ్యారు. అప్పుడు ఉష్ణోగ్రత 53.88 డిగ్రీల సెల్సియస్‌ నమోదవ్వడంతో.. అక్కడ ఉండలేక.. తలోదిక్కుకూ వెళ్లిపోయారు.

ఏథెన్స్‌లో..
– గ్రీస్‌లోని చారిత్రక ఏథెన్స్‌ కూడా వేడి ప్రాంతమే. అక్కడ 1977 జులైలో అత్యధికంగా 48 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. యూరప్‌ ఖండంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే.

లుత్‌ ఎడారిలో..
ఇరాన్‌లోని లుత్‌ ఎడారికి అస్సలు వెళ్లలేం. బొగ్గుల కొలిమిలోకి వెళ్లినట్లే ఉంటుంది. అక్కడ 2005లో 70 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఐతే.. ఇది పూర్తిగా సూర్యుడి వేడి, గాలిలో ఉక్కపోత వల్ల నమోదైన ఉష్ణోగ్రత కాదనీ.. భూమి లోపలి పరిస్థితుల వల్ల కూడా ఏర్పడిన ఉష్ణోగ్రత అనే వాదన ఉంది.

ఫ్లే్లమింగ్‌ పర్వతాలు..
పేరుకు తగ్గట్టే… చైనాలోని ఫ్లేమింగ్‌ పర్వతాలు… ఎర్రరాతితో మండిపోతూ ఉంటాయి. 2008లో నాసా అక్కడ 65.55 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను గుర్తించింది. దీనికి కూడా భూమిలోపలి వేడి కొంత కారణంగా ఉంది.

ఇప్పటివరకూ మనం చెప్పుకున్నవి.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రదేశాలు. ఇథియోపియాలోని.. డల్లోల్‌.. ఏడాది మొత్తం వేడిగానే ఉంటుంది. ఇక్కడ నీటి బుగ్గల కారణంగా.. ఈ ప్రదేశం కుతకుతా ఉడుకుతూ ఉంటుంది. దీన్ని తలచుకుంటేనే మనకు చెమటలు పట్టేస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular