Homeజాతీయ వార్తలుGlamping Site: బొంతపల్లి ‘గ్లాంపింగ్’: అడవుల్లో సాహసయాత్రకు ఇక హైదరాబాదీలు వెళ్లొచ్చు..

Glamping Site: బొంతపల్లి ‘గ్లాంపింగ్’: అడవుల్లో సాహసయాత్రకు ఇక హైదరాబాదీలు వెళ్లొచ్చు..

HMDA develops ‘glamping site’ for camping enthusiasts in Hyderabad : వారమంతా పనిచేసి వీకెండ్ లో అలా ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారు చాలా మంది ఉంటారు. ఇందుకోసం క్యాంప్ ల పేరిట అడవుల సమీపంలోకి వెళుతుంటారు. ఈ సంస్కృతి విదేశాల్లో ఎక్కువగా ఉంటుంది. భారత్ లోనూ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. వీకెండ్స్ లో పార్టీలు మాత్రమే చేసుకోకుండా ఇలా ప్రకృతి సిద్ధ ప్రాంతాలకు క్యాంపింగ్ లకు కొందరు వెళుతుంటారు. అలా ప్రకృతిలో మమేకమై.. ఆ తర్వాత కాంక్రీట్ జంగిల్ లోకి అలసట అంతా మరిచిపోయి అడుగుపెడుతుంటారు.

ప్రకృతిలో క్యాంపింగ్ అంటే అందరూ ఇష్టపడుతుంటారు. చాన్స్ దొరికితే ఖచ్చితంగా ఈ చోటుకు వెళ్లిపోదామని అనుకుంటారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాదీల కోసం క్యాంపింగ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కొత్త అనుభూతిని ప్రజలకు పంచాలని చూస్తోంది.

హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఈ సరికొత్త ఆలోచనతో ముందుకు వస్తోంది. క్యాంపింగ్ ఆసక్తి ఉన్న వాళ్లకు గ్లాంపింగ్ ను అందించాలని నిర్ణయించింది.

గ్లాంపింగ్ అంటే సాధారణంగా అడవుల్లో సేదతీరడానికి వెళ్లినవారికి అద్భుతమైన 5 స్టార్ వసతులు ఉండవు. తిండి, కొన్ని టెంట్స్ మాత్రమే వాళ్లు తీసుకెళుతారు. కానీ గ్లాంపింగ్ లో 3 స్టార్ హోటల్ లో ఉండే సౌకర్యాలు, హంగులను ఒక టెంట్ ద్వారా ఏర్పాటు చేస్తారు. లగ్జరీ స్టే, ఫుడ్, సర్వీస్ వంటివి అందించేలా కొత్త ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది. సంగారెడ్డిలోని బొంతపల్లి అర్బన్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లో ‘గ్లాంపింగ్ సైట్’ను అభివృద్ధి చేయడం ద్వారా హెచ్ఎండీఏ క్యాంపింగ్ కాన్సెప్ట్ కు ‘గ్లామర్’ విలాసాన్ని కల్పించడానికి నిర్ణయించింది. నగరంలోని క్యాంపింగ్ ఔత్సాహికులకు మంచి డెస్టినేషన్ లా మారనుంది.

డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎఫ్‌ఓటీ) పద్ధతిలో రూ.15 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు హెచ్‌ఎండీఏ ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. 15 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టును ‘లైసెన్స్ టు ఆపరేట్’ ప్రాతిపదికన ప్రతిపాదించారు.

క్లబ్ అడ్వెంచర్, లగ్జరీని ఇష్టపడే వారికి ఉద్దేశించిన ఈ సదుపాయం ఔటర్ రింగ్ రోడ్ నుండి 10 కి.మీ.. నగరం యొక్క పశ్చిమ ప్రాంతాల నుండి 30 కి.మీ దూరంలో ఉంది. ఇది 25 విలాసవంతమైన గుడారాలను (టెంట్) కలిగి ఉంటుంది. ఒక్కొక్కటి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.

పర్యాటక మంత్రిత్వ శాఖ స్పెసిఫికేషన్ల ప్రకారం.. గ్లాంపింగ్ సైట్ ప్రమాణాలు 3 స్టార్ హోటల్స్ ను తలపిస్తాయి. అంతకుమించి సౌకర్యాలుంటాయని హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. గ్లాంపింగ్ ప్రాంతంలో ట్రెక్కింగ్, సఫారీ మార్గాలను ఏర్పాటు చేస్తారు. తద్వారా పర్యాటకులకు అడ్వెంచర్ లు చేయడానికి.. చూడడాన్ని ఆస్వాదించవచ్చు. ప్రత్యేకమైన పక్షులను చూసే డెక్‌లు ఏర్పాటు చేస్తారు. ఈ సౌకర్యాలు సైట్‌లో టవర్లు ఏర్పాటు చేసి.. ఇతర సాహస కార్యకలాపాలను వీక్షించడానికి అదనంగా ఉంటాయి.

“పర్యావరణ వ్యవస్థకు ఎటువంటి భంగం కలగకుండా చూసుకోవడం ద్వారా సాహస కార్యకలాపాలు నిర్వహించబడతాయి. అభివృద్ధి మరియు కార్యకలాపాలు ప్రకృతికి హాని కలిగించవు. ఒక్క చెట్టు కూడా తొలగించబడదు. 53 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం అనుమతించబడదు ”అని హెచ్‌ఎండిఎ అధికారి ఒకరు తెలిపారు. ఇతర మౌలిక సదుపాయాలు కూడా ఉంటాయి. అంతర్గత నడక మార్గాలు, నీరు మరియు విద్యుత్ సరఫరా, అగ్నిమాపక పరికరాలు, సీసీటీవీ నిఘా, నీటి నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, తోటపని అందమైన వనాలు ఉంటాయి.. సైట్ కోసం మౌలిక సదుపాయాలు, ఇతర భాగాలను అభివృద్ధి చేస్తున్నప్పుడు, స్థానిక, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల వర్తించే ప్రమాణాలు మరియు నిబంధనలు అనుసరించబడతాయి, అధికారు తెలిపారు. దీన్ని బట్టి నగర వాసులకు దగ్గరల్లోనే ఒక ఫారెస్ట్ లో ఉన్న అనుభూతి.. అక్కడి అద్భుతాలు, సాహసాలను ఎంజాయ్ చేసేలా ఒక ప్రాంతం రూపుదిద్దుకుంటుందని అర్థమవుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular