Megastar Chiranjeevi: ‘ఆచార్య’ ఘోరపరాజయం అయినప్పటి నుంచి.. చిరు తన కొత్త సినిమాల విషయంలో చాలా మార్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే మెహర్ రమేష్ కి షాక్ తగిలింది. సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల తీసిన ‘ఆచార్య’ పెట్టుబడిలో కనీసం 50 శాతం రికవరీ సాధించలేకపోయింది. ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ అందుకోగా… రెండో రోజే కలెక్షన్స్ పడిపోయాయి. అసలు చిరు-చరణ్ కలిసి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ఇంత దారుణంగా ఫెయిల్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.

అందుకే, మెగాస్టార్ ఆలోచనలో పడ్డారు. తన భవిష్యత్ చిత్రాలపై దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. చిరంజీవి మూడు కొత్త చిత్రాలు ఆల్రెడీ సెట్స్ పై ఉన్నాయి. గాడ్ ఫాదర్ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ‘మెగాస్టార్ 154, భోళా శంకర్’ చిత్రాలు కొంత మేర చిత్రీకరణ జరుపుకున్నాయి. కాగా ‘గాడ్ ఫాదర్’ పూర్తి అయింది కాబట్టి.. మెగాస్టార్ 154 చిత్రాన్ని ముందుగా పూర్తి చేయాలని చిరంజీవి భావిస్తున్నారట.
గాడ్ ఫాదర్, భోళా శంకర్ రీమేక్ చిత్రాలు. వీటి ఫలితం ఎలా ఉన్నా, వరుసగా రిలీజ్ అయితే, ఒరిజినల్స్ తో పోల్చుతూ విమర్శలు తలెత్తడం ఖాయం. అదే దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ‘మెగాస్టార్ 154’ మాత్రం స్ట్రెయిట్ మూవీ. చిరు ఇమేజ్ కి తగ్గట్లు అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత ఇలాంటి స్ట్రెయిట్ మూవీతో రావడమే మంచిదని చిరంజీవి భావిస్తున్నాడట.
గాడ్ ఫాదర్ షూట్ పూర్తి అయిన తరుణంలో, మెగాస్టార్ 154 చిత్రాన్ని కూడా చిరు త్వరగా పూర్తి చేస్తాడట. ఐతే మెహర్ రమేష్ తో చేస్తున్న బోళా శంకర్ చిత్రాన్ని మాత్రం పోస్ట్ ఫోన్ చేస్తున్నారు. మొత్తానికి మెహర్ రమేష్ కి పెద్ద షాక్ తగిలిగింది. అసలుకే వరుస డిజాస్టర్స్ తో కనుమరుగైన మెహర్ రమేష్, ఎలాగొలా చిరంజీవితో ప్రాజెక్ట్ ఓకె చేయించుకున్నాడు.

ఇప్పుడు ఈ సినిమా కూడా పోస్ట్ ఫోన్ అవ్వడంతో పూర్తి నిరాశలో మునిపోయాడు. మెహర్ రమేష్ చివరి చిత్రం షాడో 2013లో విడుదలైంది. అంటే ఏకంగా ఓ దశాబ్దం పాటు మెహర్ రమేష్ ఖాళీగా ఉన్నాడు. ఇన్నేళ్లకు తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఇది పోస్ట్ ఫోన్ అయ్యింది.