ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ఎస్బీఐ..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇంటి నుంచే సులువుగా నామినీని యాడ్ చేసుకునే అవకాశం కల్పించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రత్యేకంగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సులభంగా నామినీ పేరును జత చేయవచ్చు. ఎస్బీఐ ఖాతాకు నామినీని జత చేయడం ద్వారా భవిష్యత్తులో ఆ ఖాతా ప్రయోజనాలను నామినీ పొందవచ్చు. Also Read: స్మార్ట్ ఫోన్ యూజర్లకు […]

Written By: Kusuma Aggunna, Updated On : February 6, 2021 5:21 pm
Follow us on

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇంటి నుంచే సులువుగా నామినీని యాడ్ చేసుకునే అవకాశం కల్పించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రత్యేకంగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సులభంగా నామినీ పేరును జత చేయవచ్చు. ఎస్బీఐ ఖాతాకు నామినీని జత చేయడం ద్వారా భవిష్యత్తులో ఆ ఖాతా ప్రయోజనాలను నామినీ పొందవచ్చు.

Also Read: స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త.. పది నిమిషాల్లో ఫుల్ ఛార్జ్..?

ఎస్బీఐ ఖాతాదారులకు బ్యాంక్ అకౌంట్ కు నామినీని జత చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి. ఎస్బీఐ కస్టమర్లు ఎస్బీఐ యోనో యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని అందులో లాగిన్ అయిన తరువాత సర్వీస్ సర్వీసెస్ సెక్షన్ ను ఎంచుకుని ఆన్‌లైన్ నామినీ ఆప్షన్ సహాయంతో సులువుగా అకౌంట్ కు నామినీ పేరును యాడ్ చేయడం సాధ్యమవుతుంది. ఈ విధంగా సులభంగా నామినీని యాడ్ చేయవచ్చు.

Also Read: జీవించి ఉండగానే అంత్య‌క్రియ‌లు చేసుకున్న వృద్ధుడు.. ఎందుకంటే..?

సమీపంలోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి కూడా నామినీని యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మొబైల్ నంబర్ సహాయంతో నామినీ యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నామినీకి బ్యాంక్ అకౌంట్ ఉన్న వ్యక్తి చనిపోతే బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులపై పూర్తి అధికారాలు ఉంటాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా నామినీని యాడ్ చేయాలంటే మొదట onlinesbi.com వెబ్ సైట్ ద్వారా లాగిన్ కావాలి.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

లాగిన్ అయిన తరువాత రిక్వెస్ట్ & ఎంక్వైరీస్ అనే ఆప్షన్ ను ఎంచుకుని.. ఆ తర్వాత ఆన్‌లైన్ నామినేషన్ ను ఎంచుకోవాలి. ఏ బ్యాంక్ ఖాతాకు కొత్త నామినీని యాడ్ చేయాలని అనుకుంటారో ఆ ఖాతాను ఎంచుకోవాలి. తరువాత ప్రొసీడ్ ట్యాబ్ ను ఎంచుకుని నామినీ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తరువాత ఓటీపీని ఎంటర్ చేసి నామీని యాడ్ చేయవచ్చు.