Tamil Nadu : ద్రవిడవాదాన్ని పాటించిన తమిళనాడులో సాంఘిక అసమానతలు తగ్గాయా?

తమిళనాడులో మోస్ట్ సెక్యూరల్ ప్రభుత్వం కాబట్టి దీనిపై ఎవరూ స్పందించరు. ద్రవిడవాదాన్ని పాటించిన తమిళనాడులో సాంఘిక అసమానతలు తగ్గాయా? లేదా అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: Neelambaram, Updated On : September 8, 2023 1:52 pm

Tamil Nadu  : ద్రవిడవాదం.. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయితే .. ద్రవిడవాదులు అధికారంలోకి వచ్చి అర్థశతాబ్ధంపైగా అయ్యింది.తమిళనాడులో ద్రవిడవాదుల పాలన మిగతా దేశానికి ఎంతవరకూ ఆదర్శంగా ఉంది? ఇది ఇవ్వాల చర్చించాల్సిన అవసరం ఉంది. ఎంత దారుణంగా తమిళనాడులో పరిస్థితులు ఉన్నాయో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

22 డిసెంబర్ లో పుదుకొట్టాయ్ జిల్లా..వంగవాయిల్ అనే గ్రామంలో మానవ మలాన్ని దళితులు మంచినీళ్లు తాగే చెరువులో కలిపిన సంస్కృతి తమిళనాడులో ఉంది. ఈరోజుకి ఆ నిందితులను ప్రభుత్వం పట్టుకోలేదంటే ఎంత అమానుషం అక్కడ రాజ్యమేలుతుందో అర్థం చేసుకోవచ్చు. అదే గ్రామంలో రెండు గ్లాసుల విధానం టీ కొట్టులో ఉంది. దళితులకు ఒక గ్లాస్, మిగతా వారికి ఇంకో గ్లాస్ లు వాడుతాయి.తమిళనాడులో వంగవాయి గ్రామంలో ఇప్పటికీ ఈ సంస్కృతి ఉంది. ఇదేదో మారుమూల గ్రామం కాదు.. అభివృద్ధి చెందిన తమిళనాడులో పరిస్థితి ఇదీ..

ద్రవిడ వాదం ఏ విధంగా ఆదర్శమో తమిళ నాయకులు చెప్పాలి. దేశం మొత్తం మీద దళితులపై అత్యాచారాలు జరిగేటటువంటి రాష్ట్రం తమిళనాడు. ఎందుకంటే అవి బయటకు రావు. కానీ ఇప్పుడు రికార్డ్ అవుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే మేధావులు నోరు వేసుకొని పడిపోయేవారు. మీడియా దాన్ని ఓవర్ బ్లో చేసేది. బెంగాల్ లో మమతా హయాంలో బీజేపీకి సపోర్ట్ చేస్తున్న దళితులు, ఆదివాసీలపై విపరీతమైన దాడులు జరుగుతున్నా మీడియాలో రావు. బీజేపీ సపోర్ట్ చేసే దళితుల విషయంలో ఎవరూ ఏం మాట్లాడరు.

తమిళనాడులో మోస్ట్ సెక్యూరల్ ప్రభుత్వం కాబట్టి దీనిపై ఎవరూ స్పందించరు. ద్రవిడవాదాన్ని పాటించిన తమిళనాడులో సాంఘిక అసమానతలు తగ్గాయా? లేదా అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.