GST in Restaurants : జీఎస్టీ పేరిట.. చాలా రెస్టారెంట్లలో జరుగుతున్న మోసమిదీ.. తెలుసుకోండి

కొందరు బిల్లు తో పాటు GSTని అది కూడా 15 నుంచి 18 శాతం వరకు విధిస్తున్నారు. ఇదేమని అడిగితే ఆ బిల్లు ప్రభుత్వానికి వెళుతుంది అని చెబుతున్నారు

Written By: NARESH, Updated On : September 6, 2023 4:04 pm

Restaurant-Overcharges

Follow us on

GST in Restaurants : కాలం మారుతున్న కొద్దీ కొత్త కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఈ క్రమంలో కొత్త కొత్త మోసాలు కూడా పుట్టుకొస్తున్నాయి. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొందరు వారికి తెలియకుండానే మోసాలు చేస్తున్నారు. కొందరు వీటిని గుర్తించగా..మరికొందరు అవగాహన లేకపోవడంతో చాలా నష్టపోతున్నారు.  మనం ఇంట్లో వండే ఫుడ్ కంటే రెస్టారెంట్లలో ఎంతో టేస్టీగా చేస్తారు. ఇక్కడ నిపుణులైన చెఫ్స్ ఉండడంతో కొత్త కొత్త రుచులతో పసందైన వంటకాలు చేస్తారు.  అప్పుడప్పుడు లేదా  పదే పదే రెస్టారెంట్ కు వెళ్లే వారు ఎంతో మంది ఉంటారు. ఈ తరుణంలో కొందరు రెస్టారెంట్ల ఓనర్లు తెలివిగా వినియోగదారుల నుంచి అత్యధికంగా డబ్బలు వసూలు చేస్తున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
మనం రెస్టారెంట్ వెళ్లిన తరువాత చివరికి బేరర్ బిల్లు తీసుకొస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది. కానీ బిల్లులో మనం తీసుకున్న ఆహారానికి చెల్లిస్తున్నామా? లేదా ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందా? అనేది గ్రహించాలి. ఎందుకంటే చాలా మంది రెస్టారెంట్ల ఓనర్లు బిల్లుతో పాటు GSTని కూడా అదనంగా చేర్చుతున్నారు. అయితే వాస్తవానికి ప్రతీ రెస్టారెంట్ నడపేవారు Compostition Tax Payer పే చేస్తుంటారు. అలా చెల్లించినప్పుడు అదనంగా జీఎస్టీ వసూలు చేయాల్సన అవసరం లేదు.
కానీ కొందరు బిల్లు తో పాటు GSTని అది కూడా 15 నుంచి 18 శాతం వరకు విధిస్తున్నారు. ఇదేమని అడిగితే ఆ బిల్లు ప్రభుత్వానికి వెళుతుంది అని చెబుతున్నారు. అయితే కస్టమర్ ఈ జీఎస్టీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇచ్చిన GST నెంబర్ తో ఆ రెస్టారెంట్ ఓనర్ Compostition Tax Payer అవునా? కాదా? అనే విషయం తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్న తరువాత అతను టాక్స్ పేయిర్ అయితే అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు.
అయితే అతను టాక్స్ పేయరా? కాదా? అని తెలుసుకోవడానికి gst.gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అక్కడ Compostition Tax Payer  అనే ఆప్షన్ లోకి వెళ్లి మీకు బిల్లులో ఇచ్చిన GST నెంబర్ ఎంట్రీ చేయాలి. అక్కడ రెస్టారెంట్ ఓనర్ ట్యాక్స్ పెయిర్ అయితే జీఎస్టీని చెల్లించొద్దు. ఒకవేళ కాకపోతే మాత్రం కస్టమర్  కేర్ కు కంప్లయింట్ ఇవ్వొచ్చు. ఇలా రెస్టారెంట్లలో, ఇతర షాపింగ్ మాళ్లలో అదనంగా జీఎస్టీ వసూలు ను అడ్డుకోండి..