IND Vs PAK: గత ఏడాది టీ20 ప్రపంచకప్ లో ఇదే పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. పాక్ ఓపెనర్లు ఇద్దరే భారత్ భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో పరువు పోయినట్టైంది. దానికి ప్రతీకారంగా ఆసియా కప్ తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ను భారత్ ఓడించింది. అయితే పాక్ ఓటమికి, భారత్ గెలుపునకు మధ్య ఒకే ఒక్కడున్నాడు.. అతడే భారత్ ను గెలిపించాడు. అతడే హార్ధిక్ పాండ్యా..

గాయంతో జట్టుకు దూరమై.. చోటు కోల్పోయి ఐపీఎల్ లో ఏకంగా గుజరాత్ కెప్టెన్ గా వచ్చి ఆ జట్టుకు టైటిల్ అందించాడు. ఐర్లాండ్ పై సిరీస్ గెలిపించాడు. దీంతో హార్ధిక్ లో నాయకత్వ లక్షణాలు.. పట్టుదల గెలిపించాలన్న కసి పెరిగిపోయింది. హార్ధిక్ ను చూస్తుంటే ఒకప్పటి ధోనినే గుర్తుకు వస్తున్నాడు. ధోనిలాగానే ఎమోషన్ ను కంట్రోల్ చేస్తున్నాడు. పరుగులు చేయడంలో అలాంటి పరిణతి కనబరుస్తున్నాడు. టైం చూసి గేర్ మారుస్తున్నాడు. ముఖ్యంగా ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్ గా నిరూపించుకుంటున్నాడు.
ధోని అలవాట్లున్న పాండ్యా ఖచ్చితంగా భవిష్యత్ టీమిండియా కెప్టెన్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. పాండ్యా ఆటతీరు, ఆత్మవిశ్వాసం చూసిన వారు ఎవరైనా సరే మరో ధోని వచ్చాడని కొనియాడుతున్నాడు. ఇతడే భారత క్రికెట్ భాగ్యరేఖను మారుస్తాడని అంటున్నారు.
చివరి ఓవర్ లో 7 పరుగులు కావాల్సిన దశలో ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ హార్దిక్ అద్భుతమైన పరిపక్వత, ప్రశాంతతను ప్రదర్శించాడు, అతను నాన్-స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న దినేశ్ కార్తీక్‌కు ‘చింతించవద్దు, నేను ఉన్నాను’ అంటూ సూచించాడు. ఇది వీడియోలో రికార్డ్ అయ్యింది. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఏం గుండెరా నీది.. ఎంత ధైర్యం’ అంటూ కొనియాడుతున్నారు. ఎందుకంటే తదుపరి బంతిని సిక్సర్‌గా కొట్టి భారత్ ను హార్ధిక్ గెలిపించాడు. అతడి ఆత్మవిశ్వాసం, నమ్మకం.. బలమైన ధృఢ చిత్తానికి ఇది నిదర్శనంగా చెప్పొచ్చు. చెప్పి మరీ భారత్ ను గెలిపించిన ధీశాలిగా హార్ధిక్ ను నెటిజన్లు వేయినోళ్లు కొనియాడుతున్నారు. అతని అసాధారణ గుండెనిబ్బర బ్యాటింగ్ తో భారత్ ను గెలిపించాడని అంటున్నాడు. హార్ధిక్ పాండ్యా వీడియోను ఇప్పుడు అందరూ షేర్ చేస్తూ కొనియాడుతున్నాడు. ఇతడే అసలు సిసలు భారత్ భవిష్యత్ కెప్టెన్ అవుతాడంటూ పేర్కొంటున్నారు.
https://www.youtube.com/shorts/HhMIX-Z6vPg