https://oktelugu.com/

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను హత్య చేసిన భర్త.. చివరకు..?

ఈ మధ్య కాలంలో సమాజంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు ప్రజల్లో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా..? అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కట్టుకున్న భార్యనే హత్య చేయించాడు. భార్యను హత్య చేసిన తరువాత ఆ హత్యను ప్రమాదంగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేశాడు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి రావడంతో ఇప్పుడు ఆ వ్యక్తి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాకు చెందిన లలిత్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 7, 2021 3:18 pm
    Follow us on

    ఈ మధ్య కాలంలో సమాజంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు ప్రజల్లో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా..? అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కట్టుకున్న భార్యనే హత్య చేయించాడు. భార్యను హత్య చేసిన తరువాత ఆ హత్యను ప్రమాదంగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేశాడు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి రావడంతో ఇప్పుడు ఆ వ్యక్తి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

    పూర్తి వివరాల్లోకి వెళితే గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాకు చెందిన లలిత్ టాంక్ వృత్తిరిత్యా సీఏగా పని చేసేవాడు. గత నెల 26వ తేదీన లలిత్ టాంక్ భార్య దక్ష్‌ బెన్‌ టాంక్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. పోలీసులు దక్ష్ ‌బెన్‌ టాంక్‌ మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అయితే దక్ష్‌ బెన్‌ టాంక్ కుటుంబ సభ్యులు ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి దక్ష్ బెన్ కాల్ డేటా ద్వారా ఆమె భర్తే హత్య చేశాడని తేల్చారు.

    ఒక వ్యక్తికి లలిత్ టాంక్ 2 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి భార్యను హత్య చేయించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. 60 లక్షల రూపాయల బీమా పాలసీ కోసం హత్య చేయించినట్టు లలిత్ టాంక్ ఒప్పుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్లాన్ ప్రకారం లలిత్ టాంక్ భార్యను గుడికి తీసుకెళ్లి మార్గమధ్యంలో మరో వ్యక్తితో హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

    ప్రమాదంలో దక్ష్ బెన్ టాంక్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. దక్ష్ బెన్ బంధువులు లలిత్ టాంక్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం లలిత్ టాంక్ చేసిన పని నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు అతనిని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.