https://oktelugu.com/

యువ జగన్ ను చూసే కేటీఆర్ ను కేసీఆర్ సీఎం చేస్తున్నాడా?

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరగనుందా..? కేటీఆర్ కు సీఎం పదవి ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా..? అధికార పార్టీ నుంచే కేటీఆర్ కు మద్దతు వస్తున్నప్పుడు కేసీఆర్ సైలెంట్ గా ఎందుకున్నారు..? కొన్ని నెలలుగా కేసీఆర్ కార్యకలాపాల్లో పాల్గొనకపోవడానికి కారణమేంటి..? తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల్లో ఇప్పుడు మెదులుతున్న ప్రశ్నలివి. కరోనా సమయంలో వారం రోజులకోసారి సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కువ శాతం ఫాం హౌస్ కే పరిమితమవుతున్నారు. అయితే కేసీఆర్ సైలెంట్ గా ఉండి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 7, 2021 / 02:24 PM IST
    Follow us on

    తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరగనుందా..? కేటీఆర్ కు సీఎం పదవి ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా..? అధికార పార్టీ నుంచే కేటీఆర్ కు మద్దతు వస్తున్నప్పుడు కేసీఆర్ సైలెంట్ గా ఎందుకున్నారు..? కొన్ని నెలలుగా కేసీఆర్ కార్యకలాపాల్లో పాల్గొనకపోవడానికి కారణమేంటి..? తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల్లో ఇప్పుడు మెదులుతున్న ప్రశ్నలివి. కరోనా సమయంలో వారం రోజులకోసారి సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కువ శాతం ఫాం హౌస్ కే పరిమితమవుతున్నారు. అయితే కేసీఆర్ సైలెంట్ గా ఉండి కేటీఆర్ ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో విషయమేంటంటే కేటీఆర్ ను సీఎం చేయడానికి ప్రధాన కారణం ఏపీ సీఎం జగన్ అని.. ఆయన యువకుడు కావడం.. ప్రజల్లోకి చొచ్చుకెళ్లడం.. ఫాలోయింగ్ చూసే కేటీఆర్ ను చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ల మధ్య అన్నదమ్ముల అనుంబంధ లాంటిది. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 2019లో ఏపీలో జగన్ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారు. తాను ఏపీలో పోటీ చేయకపోయినా జగన్ ముఖ్యమంత్రి అవుతారని మొదటి నుంచే చెప్పుకొచ్చారు. ఆ తరువాత అనుకున్నట్లే జగన్ సీఎం అయ్యారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్య వచ్చినా ఒకరినొకరు పరిష్కరించుకుంటూ వస్తున్నారు.

    తాజాగా కేటీఆర్ సీఎం పై వార్తలు వేడిని పుట్టిస్తున్నాయి. ఇటీవల టీఆర్ఎస్ మంత్రి ఈటల రాజేందర్ కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి..? అనే వాఖ్యలు రాష్ట్రంలో దుమారం లేపాయి. అయితే ఆ తరువాత కొందరు మంత్రులు సైతం ఈటల బాటలోనే వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేసీఆర్ ఎలాంటి కామెంట్ చేయకపోవడంతో ఆయన తన కుమారుడిని సీఎం పీటంపై కూర్చొబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చర్చ సాగుతోంది. అందులోనూ కొన్ని ప్రముఖ కార్యక్రమాల్లో కేసీఆర్ కు బదులు కేటీఆర్ హాజరుకానుండడం ఇక కేటీఆరే పరిపాలకుడని ప్రజలకు అర్థమవుతోంది.

    ఈ తరుణంలో కేటీఆర్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని కేసీఆర్ వ్యూహం రచిస్తున్నాడు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కేసీఆర్ కు మించినోళ్లు లేరని తెలంగాణలో రాజకీయ నాయకుడైన ప్రతి ఒక్కిరికి తెలుసు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను సీఎం చేయడంపై పెద్దాయన మౌనంగా ఉన్నాడంటే అందులో పెద్ద వ్యూహమే రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ను సంప్రదించినట్లు సమాచారం.

    ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తమకు అన్యాయం జరిగిందని ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఆందోళన చేసేవారు ఉన్నారు. కానీ కేసీఆర్ తన రాజకీయ చతురతతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ ను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. కొద్ది నెలల కిందట నీటి పంపకం విషయంలో వివాదం ముదిరినా ఆ విషయాన్ని ఇరు ముఖ్యమంత్రులు కేంద్రంపై తోసేశారు. కేంద్రం మాత్రం ఇద్దరిని సమావేశానికి పిలిచింది. కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి హాజరుకాకుండా తప్పించుకున్నారు. అయితే ఆ తరువాత మరోసారి నిర్వహించిన సమావేశానికి ఇద్దరు హాజరయ్యారు.

    ఇలాంటి కొన్ని సమస్యలు రాబోయే కాలంలో అవి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రిని కేటీఆర్ సీఎంపై ఫోన్ లో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం సీట్లో తాను కూర్చున్నా.. తన కొడుకు కూర్చున్నా ఒక్కటేనని.. అయితే తన కుమారుడికి మాత్రం సహకరించాలని జగన్ ను కోరినట్లు సమాచారం. జగన్ పాలన పటిమ.. యువ మంత్రం,, ప్రజల్లోకి చొచ్చుకెళుతున్న తీరును చూసే వయోభారంతో ఉన్న కేసీఆర్ వైదొలగాలని డిసైడ్ అయినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఇక కేటీఆర్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొడానికి ఎంతో సమయం లేదన్నట్లు తెలుస్తోంది