https://oktelugu.com/

ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఆ మెసేజ్ వస్తే జాగ్రత్త పడాల్సిందే..?

దేశంలో నోట్లరద్దు తరువాత డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. డిజిటల్ లావాదేవీల వల్ల క్యాష్ బ్యాక్ లభిస్తూ ఉండటంతో ఎక్కువమంది డిజిటల్ లావాదేవీలపై ఆసక్తి చూపుతున్నారు. అయితే డిజిటల్ లావాదేవీలు పెరగడంతో పాటు మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. చాలామంది బ్యాంకు ఖాతాదారుల ఖాతాలలో యూపీఐ లావాదేవీ చేయకుండానే బ్యాంక్ ఖాతా నుంచి నగదు కట్ అవుతోంది. రోజురోజుకు ఈ తరహా మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎస్బీఐ యూపీఐ మోసాల విషయంలో ఖాతాదారులను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 28, 2021 6:48 pm
    Follow us on

    దేశంలో నోట్లరద్దు తరువాత డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. డిజిటల్ లావాదేవీల వల్ల క్యాష్ బ్యాక్ లభిస్తూ ఉండటంతో ఎక్కువమంది డిజిటల్ లావాదేవీలపై ఆసక్తి చూపుతున్నారు. అయితే డిజిటల్ లావాదేవీలు పెరగడంతో పాటు మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. చాలామంది బ్యాంకు ఖాతాదారుల ఖాతాలలో యూపీఐ లావాదేవీ చేయకుండానే బ్యాంక్ ఖాతా నుంచి నగదు కట్ అవుతోంది.

    రోజురోజుకు ఈ తరహా మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎస్బీఐ యూపీఐ మోసాల విషయంలో ఖాతాదారులను అప్రమత్తం చేయడంతో పాటు కీలక సూచనలు చేసింది. యూపీఐ లావాదేవీ చేయకుండా బ్యాంక్ ఖాతా నుంచి నగదు కట్ అయితే వెంటనే బ్యాంక్ దృష్టికి తీసుకురావాలని అలా చేస్తే లావాదేవీని నిలిపివేస్తామని తెలిపారు. అలాంటి సమయంలో సేవలను నిలిపివేయడం కోసం ఎస్బీఐ ప్రత్యేక నంబర్లను ఇచ్చింది.

    టోల్ ఫ్రీ నెంబర్ 1800111109, ఐవీఆర్ నంబర్లు 1800 425 3800, 1800 11 2211 లేదా 9223008333 నంబర్ కు మెసేజ్ చేయడం ద్వారా నగదు లావాదేవీ గురించి ఫిర్యాదు చేయవచ్చు. https://cms.onlinesbi.com/cms/ వెబ్ సైట్ లింక్ ద్వారా కూడా సులభంగా ఆన్ లైన్ మోసాల గురించి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేయడం ద్వారా సులభంగా యూపీఐ సేవలను నిలిపివేయడం సాధ్యమవుతుంది.

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకు 44 కోట్ల మంది ఖాతాదారులు ఉండగా ఎస్బీఐ ఖాతాదారులందరికీ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. చేయని పేమెంట్లకు డబ్బులు డెబిట్ అయినట్టు మెసేజ్ వస్తే అప్రమత్తంగా ఉండాలని ట్విట్టర్ ద్వారా ఎస్బీఐ సూచనలు చేసింది.