Google Gemini Advanced: “నేను సాంకేతికతను ఎక్కువగా ఇష్టపడుతుంటాను. బానిస అయ్యే స్థాయిలో వాడలేదు. అయితే చాట్ జీపీటీ నన్ను పూర్తిగా మార్చేసింది. దాన్ని వాడుతుంటే క్రమంగా నేను బానిసనైపోతున్నాను.” ఈ మాటలు అన్నది ఎవరో కాదు ఆసియా కుబేరుడు గౌతమ్ అదాని. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని. గత ఏడాది జనవరి నెలలో ఓపెన్ ఏఐ అనే సంస్థ చాట్ జిపిటిని తెరపైకి తీసుకొచ్చింది. దీని పూర్తి పేరు “చాట్ జనరేటివ్ ఫ్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్”. ఇది అధునాతనమైన మిషన్ లెర్నింగ్ సాంకేతికతతో పనిచేస్తుంది. దీనిని ఏ ప్రశ్నయినా సరే టెక్స్ట్ రూపంలో అడగొచ్చు. ఆ ప్రశ్నకు ఏఐ టూల్ వివరమైన సమాధానాన్ని అత్యంత వేగంగా ఇస్తుంది. ఈ చాట్ జిపిటిలో అపరిమితమైన డాటా బేస్ ఉండటం వల్లే ఇది సాధ్యమవుతుంది. ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిన మూడు నెలల్లోనే మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుంది.. ఓపెన్ ఏఐ చాట్ జిపిటిని ప్రవేశపెట్టిన తర్వాత.. మైక్రోసాఫ్ట్ కాపీ లాట్ ను తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఇవి తనకు పోటీగా రావడంతో గూగుల్ మేల్కొంది. వాస్తవానికి మనం ఏదైనా విషయం గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా లింక్స్ కనిపిస్తాయి. అందులో ఉన్న సమాచారాన్ని మనం క్రోడీకరించుకోవాల్సి ఉంటుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే చాట్ జిపిటి ఒకే ఆన్సర్ ఇస్తుంది. అది కూడా చాలా సింపుల్. కన్వర్జేషన్ లాంగ్వేజ్ లో వివరంగా సమాధానం ఇస్తుంది. అందుకే ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన చాట్ జిపిటి, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన కాపీ లాట్ పాపులరయ్యాయి.. అయితే ఇవి రెండు తన గుత్తాధిపత్యానికి సవాల్ విసురుతున్న నేపథ్యంలో గూగుల్ జెమినీ రూపంలో ముందుకు వచ్చింది.
సాంకేతిక ప్రపంచం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలు పురుడు పోసుకుంటున్నాయి. ఫలితంగా అరచేతిలో ప్రపంచం ఇమిడి పోతుంది. మొన్నటిదాకా మేధస్సుతో మాత్రం జరిగే పనులు.. ఇప్పుడు కృత్రిమ మేథతో జరుగుతున్నాయి. ఆ కృత్రిమ మేథ విభాగంలో ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ తో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ అద్భుతాన్ని జనం ఆస్వాదిస్తుండగానే మైక్రోసాఫ్ట్ రంగంలోకి దిగింది. “కాపీ లాట్” ను తెరపైకి తీసుకువచ్చింది.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా పనిచేసే ఇవి స్పష్టమైన సమాచారాన్ని అందిస్తాయి. వీటిల్లో టెక్స్ట్ ఇన్ పుట్ ఆధారంగా చిత్రాలు రూపొందించవచ్చు.. నచ్చిన కవితను రాయమని.. మనకు తెలియని చాలా పనులను చేయమని ఆదేశించవచ్చు. కానీ ఇప్పుడు ఈ విభాగంలోకి గూగుల్ ప్రవేశించింది. ఎప్పటినుంచో ఈ విభాగంలో ప్రయోగాలు చేస్తున్న గూగుల్.. జెమినిని రంగంలోకి దింపింది. ఓపెన్ ఏఐ, మైక్రో సాప్ట్ కు పోటీగా గూగుల్ జెమినిని తీసుకొచ్చింది.. దీనికి సంబంధించిన ప్రీమియం ప్లాన్ లు కూడా ప్రకటించింది.. గూగుల్ జెమిని అధునాతన వెర్షన్ గూగుల్ వన్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కు ₹1,950 రుసుముగా ప్రకటించింది.. ఇది వద్దూ అనుకుంటే..
ఉచిత వెర్షన్ కోసం Gemini. Google.com ను సందర్శించి, మీ గూగుల్ ఖాతా ద్వారా లాగ్ ఇన్ కావాల్సి ఉంటుంది. బార్డ్ ను యాక్సెస్ చేస్తే.. జెమిని చాట్ బాట్ సౌకర్యాన్ని కల్పిస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే గూగుల్ జెమిని అనేది ఒక మల్టీ మోడల్ చాట్ బాట్. ఇది వచనం, చిత్రాలు రూపొందించడం, కోడ్ లాంగ్వేజ్ తో పాటు మరిన్ని విషయాల్లో స్పష్టమైన సమాచారం ఇస్తుంది. ఓపెన్ ఆర్టిఫిషియల్ చాట్ జిపిటి, మైక్రోసాఫ్ట్ కాపీ లాట్ లాగానే ఇందులో టెక్స్ట్ ఇన్పుట్ ఆధారంగా చిత్రాలు రూపొందించవచ్చు. సాంస్కృతిక, సూక్ష్మ నైపుణ్యాలతో భాషలను కూడా అనువదించవచ్చు. లేదా వచన, వివరణలను ఉపయోగించడం ద్వారా ప్రేరణ పొందిన సంగీత కూర్పులను కూడా స్వీకరించవచ్చు. గూగుల్ జెమిని అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ.. చిన్నపాటి షరతు విధించింది. గూగుల్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రీమియం ప్లాన్ ను నెలకు ₹1,950కు విక్రయిస్తోంది. ఈ ప్లాన్ టెరాబైట్ క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడిటింగ్ టూల్స్, ఇతర ప్రయోజనాలను కల్పిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రీమియం ప్లాన్ వినియోగదారుల కోసం అతి త్వరలో జిమెయిల్, డాక్స్, మరిన్నింటిలో జెమిని ని అందిస్తామని గూగుల్ ప్రకటించింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Google changed bard to gemini launching gemini advanced
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com