https://oktelugu.com/

క్రెడిట్ కార్డులు వాడేవాళ్లకు బ్యాంకులు భారీ షాక్..?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మొదలైన తరువాత క్రెడిట్ కార్డులు వాడే వాళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆన్ లైన్ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఎక్కువమంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. వ్యక్తిగత అవసరాల కొరకు క్రెడిట్ కార్డులు వాడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈకామర్స్ సంస్థలు, బ్యాంకులు క్రెడిట్ కార్డులపై భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. Also Read: తప్పుగా బదిలీ చేసిన నగదును రివర్స్ లో ఎలా పొందాలంటే..? క్రెడిట్ కార్డుల వినియోగం పెరగగా అదే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 17, 2021 / 09:35 AM IST
    Follow us on

    దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మొదలైన తరువాత క్రెడిట్ కార్డులు వాడే వాళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆన్ లైన్ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఎక్కువమంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. వ్యక్తిగత అవసరాల కొరకు క్రెడిట్ కార్డులు వాడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈకామర్స్ సంస్థలు, బ్యాంకులు క్రెడిట్ కార్డులపై భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

    Also Read: తప్పుగా బదిలీ చేసిన నగదును రివర్స్ లో ఎలా పొందాలంటే..?

    క్రెడిట్ కార్డుల వినియోగం పెరగగా అదే సమయంలో వ్యక్తిగత అవసరాల కొరకు క్రెడిట్ కార్డులను ఎక్కువమంది వాడుతున్నారు. అవసరం లేకపోయినా వస్తువులను కొనుగోలు చేస్తూ ఈ.ఎం.ఐలను సకాలంలో చెల్లించలేకపోతున్నారు. ఇలా చేయడం వల్ల బ్యాంకులు దీర్ఘకాలంలో భారీ మొత్తంలో నష్టపోతున్నాయి. రోజురోజుకు ఇలా చేసేవారి సంఖ్య పెరుగుతుండటంతో బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

    Also Read: రూ.2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్థిక శాఖ..!

    క్రెడిట్ కార్డుల జారీకి సంబంధించిన నియమ నిబంధనల్లో బ్యాంకులు కీలక మార్పులు చేశాయి. ప్రస్తుతం క్రెడిట్ కార్డును వాడుతున్న వారి క్రెడిట్ లావాదేవీలపై లిమిట్ ను బ్యాంకులు భారీగా తగ్గించాయి. ఇకపై కొత్తగా కార్డు తీసుకోవాలని భావించేవాళ్లకు బ్యాంకులు సిబిల్ స్కోర్ ను పరిశీలించి కార్డులు మంజూరు చేయనున్నాయి. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే ఇకపై క్రెడిట్
    కార్డులు మంజూరు కావు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    బ్యాంక్ లో రుణాలు మంజూరు చేసే ముందు బ్యాంకులు వినియోగదారుల క్రెడిట్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటాయి. క్రెడిట్ కార్డుల వల్ల మొండిబకాయిలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.