https://oktelugu.com/

డయాబెటిస్ రోగులు కలబంద చక్కెర తినకూడదా..?

దేశంలో రోజురోజుకు మధుమేహంతో బాధ పడేవారి సంఖ్య పెరుగుతోంది. మధుమేహంతో బాధ పడేవాళ్లు చక్కెర తినకూడదనే సంగతి తెలిసిందే. అందువల్ల ఆరోగ్యంపై అవగాహన ఉన్నవాళ్లు చక్కెర తినడానికి ఆసక్తి చూపరు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉండే వాటిని తినడానికి ఆసక్తి చూపుతారు. అలా ప్రత్యామ్నాయంగా ఉపయోగించే చక్కెరలలో కలబంద చక్కెర కూడా ఒకటి. కలబందలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో మూలకాలు ఉన్న సంగతి తెలిసిందే. Also Read: మాంసాహారం తిన్న తర్వాత బాదం తింటే కలిగే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 17, 2021 / 09:05 AM IST
    Follow us on

    దేశంలో రోజురోజుకు మధుమేహంతో బాధ పడేవారి సంఖ్య పెరుగుతోంది. మధుమేహంతో బాధ పడేవాళ్లు చక్కెర తినకూడదనే సంగతి తెలిసిందే. అందువల్ల ఆరోగ్యంపై అవగాహన ఉన్నవాళ్లు చక్కెర తినడానికి ఆసక్తి చూపరు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉండే వాటిని తినడానికి ఆసక్తి చూపుతారు. అలా ప్రత్యామ్నాయంగా ఉపయోగించే చక్కెరలలో కలబంద చక్కెర కూడా ఒకటి. కలబందలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో మూలకాలు ఉన్న సంగతి తెలిసిందే.

    Also Read: మాంసాహారం తిన్న తర్వాత బాదం తింటే కలిగే లాభాలివే..?

    కలబంద చక్కెరలో ఆరోగ్యకరమైన ఫైబర్స్ ఉంటాయి. ఆరోగ్యకరమైన ఫైబర్స్ జీవక్రియ సరిగ్గా జరగడంలో సహాయపడతాయి. ఫ్రక్టోజ్ రక్తంలోని చక్కెర స్థాయిలను తక్కువ వ్యవధిలో పెంచలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫ్రక్టోజ్ స్థాయి ఎక్కువగా ఉన్న తీపి పదార్థాలను తీసుకుంటే మధుమేహ రోగులకు మేలు జరుగుతుంది. ఎలుకలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు.

    Also Read: బేకింగ్ సోడా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

    సాధారణ చక్కెరలో 50 శాతం ఫ్రక్టోజ్ ఉండగా కలబంద చక్కెరలో మాత్రం 85 శాతం వరకు ఫ్రక్టోజ్ ఉంటుంది. మన శరీరంలోకి చేరిన ఫ్రక్టోజ్ ను కాలేయం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే కలబంద చక్కెర తినడం వల్ల లాభాలు ఉన్నా ఎక్కువగా మాత్రం తీసుకోకూడదు. కలబంద చక్కెర ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్, ఫాటీ లివర్ డిసీజ్ లకు కారణమవుతుంది.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    అయితే మధుమేహంతో బాధ పడేవాళ్లు వైద్యుల సలహాలు, సూచనల ప్రకారమే కలబంద చక్కెరను తీసుకోవాల్సి ఉంటుంది. మధుమేహంతో బాధ పడేవాళ్లు స్టివియా, ఎరిత్రిటోల్, గ్జైలిటోల్ లాంటి ప్రత్యామ్నాయ చక్కెరలను కూడా తీసుకోవచ్చు. అయితే కలబంద చక్కెర వల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుని కలబంద చక్కెరను వాడితే మంచిది.