మాంసాహారం తిన్న తర్వాత బాదం తింటే కలిగే లాభాలివే..?

సాధారణంగా మనలో చాలామంది శాఖాహారంతో పోలిస్తే మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అయితే మాంసాహారం తిన్న తరువాత బాదం తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వేటమాంసం, రెడ్‌ మీట్ తిన్నవాళ్లు కచ్చితంగా బాదం తినాలి. క్యాల్షియమ్‌ పాళ్లు ఎక్కువగా ఉన్న బాదం తింటే కొవ్వు అత్యధికంగా ఉండే పదార్థాల వల్ల గుండెకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. Also Read: డయాబెటిస్ రోగులు కలబంద చక్కెర తినకూడదా..? సాధారణ సమయాల్లో బాదం తీసుకున్నా మన శరీరానికి […]

Written By: Kusuma Aggunna, Updated On : March 19, 2021 11:20 am
Follow us on

సాధారణంగా మనలో చాలామంది శాఖాహారంతో పోలిస్తే మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అయితే మాంసాహారం తిన్న తరువాత బాదం తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వేటమాంసం, రెడ్‌ మీట్ తిన్నవాళ్లు కచ్చితంగా బాదం తినాలి. క్యాల్షియమ్‌ పాళ్లు ఎక్కువగా ఉన్న బాదం తింటే కొవ్వు అత్యధికంగా ఉండే పదార్థాల వల్ల గుండెకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది.

Also Read: డయాబెటిస్ రోగులు కలబంద చక్కెర తినకూడదా..?

సాధారణ సమయాల్లో బాదం తీసుకున్నా మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందనే సంగతి తెలిసిందే. బాదంలో ఉండే పోషకాలు ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో తోడ్పడతాయి. విటమిన్ ఈ ఎక్కువగా ఉండే బాదం తీసుకోవడం వల్ల ఆహారనాళం ఆరోగ్యంగా ఉంటుంది. మంచి పెరుగు వల్ల జీర్ణాశయానికి ఎంత మేలు జరుగుతుందో బాదం వల్ల కూడా శరీరానికి అంతే మేలు జరుగుతుంది.

Also Read: బేకింగ్ సోడా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

బాదం తినడం వల్ల శరీరంలో ఎక్కడైనా మంట, వాపులతో ఇన్‌ఫ్లమేషన్‌ లకు కూడా చెక్ పెట్టవచ్చు. బాదంలో ఉండే ఒమెగా–3 ఆల్ఫా లినోలిక్‌ యాసిడ్‌ ఇన్‌ఫ్లమేషన్‌ ను తగ్గించడంలో తోడ్పడుతుంది. మాంసాహారంలో కొవ్వుపాళ్లు ఒకింత ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. బాదంలో ఉండే పోషకాలు కొవ్వుల దుష్ప్రభావాన్ని తగ్గించి గుండె జబ్బుల నుంచి కాపాడటంలో దోహదపడతాయి.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

బాదం పలుకులు కరోనరీ గుండెజబ్బులను సమర్థవంతంగా నివారిస్తాయని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. ప్రతిరోజూ నాలుగైదు బాదం పప్పులు తింటే మలబద్ధకం సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.