https://oktelugu.com/

రైతులకు శుభవార్త.. ఈ పంటతో ఎకరానికి 2.50 ల‌క్ష‌ల ఆదాయం..!

దేశంలో వ్యవసాయం చేస్తున్న రైతులలో చాలామందికి పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. అకాల వర్షాలు, వరదలు, చీడ పురుగుల వల్ల రైతులు పంటను నష్టపోతున్నారు. పంట బాగా పండినా గిట్టుబాటు ధర లభించకపోవడం, కూలీ ఖర్చులు అంతకంతకూ పెరుగుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే తెలివిగా వ్యవసాయం చేస్తే వ్యవసాయంతో కూడా లక్షలు సంపాదించవచ్చని కొంతమంది రైతులు ప్రూవ్ చేస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలోని మానుకోటకు చెందిన రైతులు పచ్చిమిర్చి సాగులో కొత్త విధానం ద్వారా లక్షల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 1, 2021 / 06:25 PM IST
    Follow us on

    దేశంలో వ్యవసాయం చేస్తున్న రైతులలో చాలామందికి పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. అకాల వర్షాలు, వరదలు, చీడ పురుగుల వల్ల రైతులు పంటను నష్టపోతున్నారు. పంట బాగా పండినా గిట్టుబాటు ధర లభించకపోవడం, కూలీ ఖర్చులు అంతకంతకూ పెరుగుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే తెలివిగా వ్యవసాయం చేస్తే వ్యవసాయంతో కూడా లక్షలు సంపాదించవచ్చని కొంతమంది రైతులు ప్రూవ్ చేస్తున్నారు.

    మహబూబాబాద్‌ జిల్లాలోని మానుకోటకు చెందిన రైతులు పచ్చిమిర్చి సాగులో కొత్త విధానం ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. సాధారణంగా పచ్చిమిర్చి సాగు చేస్తే ఎకరాకు 2.50 లక్షల రూపాయల ఆదాయం మాత్రమే వస్తుంది. అయితే మల్చింగ్‌ విధానంలో ఒక్కసారి నారు పోసినా 15 రోజులకు ఒకసారి పంట తీయవచ్చని రైతులు చెబుతున్నారు. 15 రోజులకు ఒకసారి పంట తీయవచ్చని ఎకరానికి 2.50 లక్షల ఆదాయం లభిస్తుందని రైతులు చెబుతున్నారు.

    మిర్చి నారును ఒకసారి నాటితే 6 నెలల నుంచి 8 నెలల వరకు కాస్తుందని.. ఈ విధానంలో కలుపు సమస్య కూడా ఉండదని రైతులు చెబుతున్నారు. రైతులకు ఉద్యాన శాఖ నుంచి డ్రిప్ పైపులను పొందే అవకాశం ఉంటుంది. యాజమాన్య పద్ధతిలో గరుడ రకం పచ్చిమిర్చిని సాగు చేయడం ద్వారా భారీగా ఆదాయం మిగులుతుందని తెలుస్తోంది. మహబూబాబాద్‌, తొర్రూరు మార్కెట్లలో రైతులు ఈ పంటను విక్రయిస్తున్నారు.

    కొంతమంది రైతులు గత రెండు మూడు సంవత్సరాల నుంచి పంట పండిస్తున్నామని.. అన్ని ఖర్చులు పోగా లక్షల్లో లాభాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించడం వల్ల రైతులు పంట సాగుకు ముందుకొస్తున్నారని తెలుస్తోంది.