France vs Morocco Semi Final 2022: పెను సంచలనం నమోదు కాలేదు.. ఊహించినట్టే జరిగింది. ఫైనల్ కు ఫ్రాన్స్ వెళ్లిపోయింది. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో సత్తా చాటింది. మొరాకో తో జరిగిన సెమీఫైనల్ లో 2_0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఆట మొదలైన ఐదవ నిమిషానికే ఫ్రాన్స్ ఆటగాడు హెర్నాన్డేజ్ తొలిగోల్ సాధించాడు. ఆట ద్వితీయార్థంలో 79 నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు కోలో మానీ మరో గోల్ సాధించడంతో ఫ్రాన్స్ 2_0 ఆధిక్యానికి వెళ్లి విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటినాతో ఫ్రాన్స్ తలపడుతుంది.

అద్భుతాలు జరగలేదు
” ఈ టోర్నీలో ఐరోపా ఖండంలోని అన్ని జట్ల పై గెలిచాం. ఏ మ్యాచ్ లోనూ ప్రత్యర్థి జట్టుకు గోల్ సాధించే అవకాశం ఇవ్వలేదు. దీనిని బట్టి అర్థం కావడం లేదా మేము దేనికోసం వచ్చామో” ఫ్రాన్స్ తో సెమి ఫైనల్ మ్యాచ్ కు ముందు మొరాకో ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ మ్యాచ్ లో ఆ స్థాయి ప్రదర్శన వారు చూపలేదు. లీగ్, క్వార్టర్స్ పోటీల్లో అనితర సాధ్యమైన డిఫెన్స్ ఆట తీరు ప్రదర్శించిన మొరాకో ఈ మ్యాచ్లో తేలిపోయింది. సాధారణంగా ప్రత్యర్థి జట్లకు గోల్ చేసే అవకాశాన్ని ఇవ్వని మొరాకో ఈ మ్యాచ్ లో ఎందుకో తడబడింది. ముఖ్యంగా ఆట ప్రారంభమైన ఐదవ నిమిషానికే ఫ్రాన్స్ జట్టు ఆటగాడు హెర్నాన్డేజ్ గోల్ సాధించాడు అంటే మొరాకో డిఫెన్స్ ఎంత బలహీనంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.. పైగా మైదానంలో చిరుతల్లా కదిలే మొరాకో క్రీడాకారులు ఈ మ్యాచ్లో ఎందుకో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ వరల్డ్ కప్ లో బెల్జియం, క్రొయోషియా, స్పెయిన్, పోర్చుగల్ లాంటి ఫుట్ బాల్ పవర్ హౌస్ లాంటి జట్లను ఒక్క గోల్ కూడా సాధించకుండా చేసిన మొరాకో జట్టు.. సెమీ ఫైనల్ లో ఈ స్థాయి ప్రదర్శన చేయడాన్ని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత మ్యాచ్లో సమష్టిగా ప్రత్యర్థి గోల్ పోస్టులపై దాడులు చేసిన మొరాకో జట్టు ఈసారి ఆ స్థాయి దూకుడు ప్రదర్శించలేదు.
ఫ్రాన్స్ జోరు చూపింది
డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ టోర్నీలో అడుగుపెట్టిన ఫ్రాన్స్… ఆ స్థాయిలో ఆట ప్రదర్శించింది.. సెమీ ఫైనల్ మ్యాచ్లో తన స్థాయి తీరు ఆట ప్రదర్శించింది.. ముఖ్యంగా ఫ్రాన్స్ ఆటగాళ్లు ఆట ప్రారంభమైన నాటి నుంచే దూకుడు ప్రదర్శించారు.. ఈ టోర్నీలో ఇప్పటివరకు ప్రత్యర్థి జట్లకు గోల్ చేసే అవకాశం ఇవ్వని మొరాకో జట్టుపై ఆట ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే గోల్ సాధించి తమ ఉద్దేశం ఏమిటో ఆ జట్టుకు చెప్పకనే చెప్పారు.

ఇక గతేడాది కప్ ను ఒడిసి పట్టిన ఫ్రాన్స్.. ఈసారి కూడా అదే జోరు కొనసాగించింది. ముఖ్యంగా మ్యాచ్ ప్రారంభం నుంచి బంతిని తన నియంత్రణలో ఉంచుకుంది.. ప్రత్యర్థి జట్టు డిఫెన్స్ ఆడకుండా చుక్కలు చూపించింది . మొదటినుంచి ఎటాకింగ్ ఆటతీరుతో మొరాకోకు సినిమా చూపించింది.. ఆట మొదలైన ఐదు నిమిషాల్లోనే గోల్ సాధించి, తన ఆధిక్యాన్ని ప్రధమార్ధం ముగిసే వరకు నిలుపుకుంది.. ఇక ద్వితీయార్థంలోనూ అదే జోరు కొనసాగించింది.. 79 వ నిమిషంలో మరో గోల్ సాధించి… తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించుకుంది. అంతేకాదు మొరాకో జట్టుకు ఏ దశలోనూ గోల్స్ చేసే అవకాశం ఇవ్వలేదు. దీంతో 2_0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ ఫైనల్ చేరింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాతో తలపడనుంది. ఫ్రాన్స్ విజయంలో హెర్నాన్డేజ్, కోలో మానీ కీలక పాత్ర పోషించారు.