https://oktelugu.com/

విశాఖ ఉక్కుపై కేంద్రం తేల్చేసింది.. ఏపీ ఏం కానుంది?

విశాఖ ఉక్కుపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న సమయంలో కేంద్రం బాంబ్ పేల్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు పార్లమెంట్ లో విస్పష్ట ప్రకటన చేశారు. లోక్ సభలో విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా స్పష్టమైన ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఏపీ రాష్ట్రానికి ఎలాంటి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 8, 2021 7:22 pm
    Follow us on

    విశాఖ ఉక్కుపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న సమయంలో కేంద్రం బాంబ్ పేల్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు పార్లమెంట్ లో విస్పష్ట ప్రకటన చేశారు.

    లోక్ సభలో విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా స్పష్టమైన ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఏపీ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో రాష్ట్రానికి ఎలాంటి ఈక్విటీ షేర్లు లేవని స్పష్టం చేశారు.

    ఇక విశాఖ ఉక్కు పరిశ్రమలో 100శాతం పెట్టుబడులను కేంద్రప్రభుత్వం ఉపసంహరిస్తోందని.. ప్రైవేటీకరిస్తున్నామని నిర్మల సంచలన ప్రకటన చేశారు. మొత్తం ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెంపు కోసం ఈ నిర్ణయమన్నారు.

    స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో తాము సంప్రదింపులు జరిపామని నిర్మల ప్రకటన చేశారు.దీంతో ఇక విశాఖ పరిశ్రమను ప్రభుత్వ పరంలో నడపరన్న విషయం తేటతెల్లమైంది. ఖచ్చితంగా ప్రైవేటు పరం చేస్తారని నిర్ధారణ అయిపోయింది.

    విశాఖ ఉక్కు కోసం ఇటీవలే ఏపీ బంద్ చేసిన అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం చెప్పడంతో దీనిపై ఏం చేస్తారన్నది సంచలనంగా మారింది.