Pakistan : పాకిస్తాన్ కుక్కలు చింపిన విస్తరిలా మారిపోతోంది. ఒకనాడు బెలూచీల తిరుగుబాటుతోనే సతమతమవుతుందని అనుకుంటే.. ఫక్తూన్లూ అరాచకం సృష్టిస్తున్నారు. ఇప్పుడు పంజాబీల ఆధిక్యానికి వ్యతిరేకంగా సింధూలు పోరాడుతున్నారు. ఇవన్నీ కూడా జాతుల పోరాటం. పంజాబీలకు వ్యతిరేకంగా మిగతా జాతులంతా తిరుగుబాటు చేస్తున్నారు.
రెండోది జియా ఉల్ హక్ తీసుకొచ్చిన రాడికల్ ఇస్లాం ఇప్పుడు పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశంగా మారింది. తాలిబన్లకు సపోర్టు చేస్తూ.. ఇటు కశ్మీర్ లోనూ ఎగదోయాలని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని ఉంచకూడదని ఈ రాడికల్ ఇస్లాం ఫైట్ చేస్తోంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వ మనుగడకే ఈ రాడికల్ ఇస్లాం ఇప్పుడు పెనుముప్పుగా మారింది.
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే.. ఇప్పుడు ఈ జాతుల తిరుగుబాటు, ఉగ్రవాదంతో మరింతగా అగ్నికి ఆజ్యం పోస్తోంది. పాకిస్తాన్ లో పెట్రోల్ లీటర్ ధర 300 దాటింది. డీజిల్ 310 అయ్యింది. కరెంట్ బిల్ కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గోధుమల కోసం జనాలు ఎగబడుతున్నారు. శ్రీలంకలో ఆర్థిక దివాళాకోరుతనం వచ్చి అక్కడి ప్రభుత్వం పడిపోయింది. పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఆ అంచున ఉంది.
జాతుల తిరుగుబాటు, రాడికల్ ఇస్లాంతో పాటు ఆర్థికంగా దివాలా పాకిస్తాన్ ని దహించివేస్తున్న పరిస్థితిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.