CAA : CAA చట్టం పేరు మారుమోగుతోంది. మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా పెద్ద వివాదం చెలరేగుతోంది. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు దీన్ని అమలు చేయడాన్ని నిరసిస్తున్నాయి. 2019లో భారత పార్లమెంట్ సీఏఏపై చట్టం చేసింది. కానీ ఈరోజు వరకూ అమలుకు నోచుకోలేదు.
అసలు సీఏఏ అంటే ఏమిటీ? ఈ చట్టం ప్రాధాన్యత ఏంటి? మోడీ సర్కార్ ఎందుకు పట్టుబడుతోందన్నది ఇక్కడ చర్చించాలి.
ఒకప్పటి అఖండ భారత్ లో భాగమైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ లోని మైనార్టీలు భారత్ కు వలస వస్తే వారికి వేగంగా భారత పౌరసత్వం ఇవ్వడమే ఈ ‘సీఏఏ’ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయా దేశాల్లోని మైనార్టీలంటే హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్దులు లాంటి వారికి ఈ సౌకర్యం కల్పిస్తుంది.
నాకు పాకిస్తాన్ విభజన సమయంలో హిందువులకు నాటి అధ్యక్షుడు జిన్నా అనేక హామీలిచ్చారు. కానీ వాటిని అమలు చేయకుండా హిందువులను ఊచకోత కోశారు. ఆ విభజన హామీలు పాక్, బంగ్లాదేశ్, అప్ఘన్ లలో అమలు కాకపోవడంతోనే ఆదేశాల్లోని మైనార్టీలకు భారత్ అక్కున చేర్చుకొని పౌరసత్వం ఇవ్వడం మంచి పరిణామం.
ఎట్టకేలకు అమలు దిశగా CAA చట్టం, వచ్చే మార్చ్ లోపు తుది రూపం దాల్చనున్న నేపథ్యంలో దీనిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడండి.