https://oktelugu.com/

Mumbai : 2024లో రూపురేఖలు మారుతున్న ముంబాయి నగరం

ఇక లోకల్ ట్రైన్స్ లో విపరీతమైన జనాలతో కనీసం నిలుచోవడానికి చోటు ఉండదు. కిక్కిరిసిపోతాయి. తొక్కిసలాటలో కళ్ల అద్దాలు, సెల్ ఫోన్లు కూడా పోతుంటాయి. బస్సుల్లో , క్యాబ్ లో వెళితే టైంకు వెళ్లలేం. అందుకే మెట్రో రైళ్లలో జనాలతో మొత్తం నిండిపోతుంటుంది.

Written By:
  • NARESH
  • , Updated On : January 5, 2024 5:34 pm

    Mumbai : ముంబై నగరాన్ని చూస్తే బాధేస్తోంది. ఎయిర్ పోర్ట్ నుంచి సౌత్ నగరానికి వెళ్లేటప్పుడు ధారవి మురికివాడ కనిపిస్తుంది. మురికివాడలో కనీస వసతులు లేవు. మురికి కాలువలు లేవు.టాయిలెట్స్ లేవు.. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా ధారవిది నిలిచింది.

    ఇక లోకల్ ట్రైన్స్ లో విపరీతమైన జనాలతో కనీసం నిలుచోవడానికి చోటు ఉండదు. కిక్కిరిసిపోతాయి. తొక్కిసలాటలో కళ్ల అద్దాలు, సెల్ ఫోన్లు కూడా పోతుంటాయి. బస్సుల్లో , క్యాబ్ లో వెళితే టైంకు వెళ్లలేం. అందుకే మెట్రో రైళ్లలో జనాలతో మొత్తం నిండిపోతుంటుంది.

    ఢిల్లీకి ఇంత ప్రయారిటీ ఇచ్చి వేలాది కోట్లు కుమ్మరిస్తున్నారు కదా.. ముంబైని ఎందుకు డెవలప్ చేయడం లేదని అనుకునేవాళ్లం.. ముంబై నగరం రూపు రేఖలు మారబోతున్నాయి. ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. జనవరి 12వ తేదీ ప్రధాని మోడీ ఒక శంకుస్థాపన చేయబోతున్నారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ను కనెక్ట్ చేయబోతున్నాయి. సౌత్ ముంబై నుంచి నవీ ముంబైకి సముద్రం మీద మార్గం ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 21.8 కి.మీల ఈ దూరానికి సీలింగ్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. సముద్రం మీద 16 కి.మీలు ఏర్పాటు చేశారు.థానే, ఫుణేలతో సంబంధం లేకుండా నేరుగా ముంబై, నవీ ముంబైకి కనెక్టివిటీ ప్రారంభమైంది.

    2024లో రూపురేఖలు మారుతున్న ముంబాయి నగరంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    2024లో రూపురేఖలు మారుతున్న ముంబాయి నగరం || Mumbai City || Ram Talk